పురుషులతో సమానంగా రాణించాలి
మిస్ ఆసియా రష్మీఠాకూర్
గద్వాలలో పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో 2కే రన్
హాజరైన జెడ్పీ చైర్పర్సన్ సరిత,ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల/గద్వాల న్యూటౌన్, మార్చి 7 : మారుతున్న కాలానుగుణంగా సమాజంలో, మహిళల్లో మార్పు రావాలని మిస్ ఆసియా రష్మీ ఠాకూర్ సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో 2కే రన్ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రష్మీ ఠాకూర్ హాజరయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి, ఎస్పీ రంజన్త్రన్ కుమార్, అదనపు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి జెండా ఊపి 2కే రన్‌ను ప్రారంభించారు. ఇండోర్ స్టేడియం నుంచి పాతబస్టాండ్ మీదుగా వెళ్లి మళ్లీ ఇండోర్ స్టేడియం వరకు రన్‌ను నిర్వహించారు. విద్యార్ధినులు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం శాంతి కపోతాలను ఎగరవేశారు. ఈ సందర్భంగా రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ ప్రతి రంగంలో మహిళలు పురుషులతో సమానంగా రాణించాలన్నారు. మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక రోజుల్లో మాత్రమే కాకుండా 365 రోజులూ మహిళలను గౌరవించాలన్నారు.
అంతకుముందు జెడ్పీ చైర్పర్సన్ సరిత మాట్లాడుతూ మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. మహిళా సాధికారతే సర్కార్ లక్ష్యమన్నారు. ఆడపిల్లల్లో మానసిక ైస్థెర్యం, ఆత్మ విశ్వాసం కలిగించాలన్నారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మాట్లాడుతూ మహిళల శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపడుతున్నట్లు చెప్పారు. షీటీమ్స్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్ వంటి పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఎస్పీ రంజన్ రతన్‌కుమార్ మాట్లాడుతూ పురుషులకు దీటుగా అన్ని రకాల వ్యవస్థలను నడిపించే శక్తి మహిళలకు ఉందన్నారు. కుటుంబ వ్యవస్థను చక్కపెట్టడంలో స్త్రీల పాత్ర కీలకమన్నారు. డయల్ 100, షీటీం టోల్‌ఫ్రీ నంబరుకు ఫోన్ చేస్తే పోలీసులు క్షణాల్లో అక్కడికి చేరుకొని మహిళలకు రక్షణ కల్పిస్తారన్నారు. రన్ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం విజేతలుగా నిలిచిన ముగ్గురికి బహుమతులు అందజేశారు. ఎమ్మెల్యే దంపతులను ఎస్పీ సన్మానించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రాములునాయక్, డీఎస్పీ రంగస్వామి, సీఐ షేక్‌మహబూబ్‌బాషా, జెడ్పీ వైస్ చైర్పర్సన్ సరోజమ్మ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, మున్సిపల్ చైర్మన్లు కేశవ్, కరుణ, కౌన్సిలర్లు, విద్యార్థినులు, మహిళలు పాల్గొన్నారు.