e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జోగులాంబ(గద్వాల్) ముక్కోటి వృక్షార్చన ఆదర్శం కావాలి

ముక్కోటి వృక్షార్చన ఆదర్శం కావాలి

  • మంత్రి కేటీఆర్‌ జన్మదిన సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
  • జిల్లా వ్యాప్తంగా సంబురాలు నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు
  • ఊరు వాడా మొక్కలు నాటిన ప్రజాప్రతినిధులు

మక్తల్‌ రూరల్‌, జూలై 24 : ఐటీ, పురపాలక శాఖ మం త్రి కేటీఆర్‌ జన్మదిన్సోవాన్ని పురస్కరించుకొని చేపట్టిన ము క్కోటి వృక్షార్చన కార్యక్రమం ఆదర్శవంతం కావాలని జె డ్పీ చైర్‌పర్సన్‌ వనజాగౌడ్‌ పిలుపునిచ్చారు. శనివారం మం డలంలోని మంథన్‌గోడ్‌ దత్తాత్రేయస్వామి ఆలయంలో కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు స్వామివారికి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం గ్రామంలోని రైతువేదిక ఆవరణ పరిసరాల్లో మొక్కలు నాటారు. నాటిన ప్రతి మొక్కనూ పెంచి పోషించాలని, దీనిని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమం లో సర్పంచ్‌ మహాదేవమ్మ, ఎంపీటీసీ సుమిత్ర, ఉపసర్పం చ్‌ కృష్ణయ్యగౌడ్‌, నాయకులు పాల్గొన్నారు.

సంబురాలు నిర్వహించిన నాయకులు
కృష్ణ : జూలై 24 : మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మాగనూర్‌ మండలంలోని నరసింహస్వామి ఆలయంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్‌ కట్‌ చేసి సంబురాలు జరుపుకొన్నారు. ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అనంతరం కృష్ణ మండలంలోని ఖాన్‌దొడ్డిలో ఎంపీపీ పూర్ణిమ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు విజ య, జెడ్పీటీసీ అంజనమ్మతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఉమ్మడి మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, టీఆర్‌ఎస్‌ మండలాల అధ్యక్షులు ఎల్లారెడ్డి, మహిపాల్‌రెడ్డి, విజయ్‌, సర్పంచులు, నాయకు లు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పండుగలా ముక్కోటి వృక్షార్చన
ఊట్కూర్‌, జూలై 24 : మండలంతోపాటు ఆయా గ్రా మాల్లో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమం పం డుగ వాతావరణాన్ని తలపించింది. ఆయా గ్రామాల్లో ప్ర జాప్రతినిధులు, అధికారులు ప్రజల భాగస్వామ్యంతో మొ క్కలు నాటారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన ముక్కోటి వృక్షార్చన కార్యక్రమానికి జెడ్పీ సీఈవో సిద్ధిరామప్ప, ఎంపీపీ లక్ష్మి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ బాల్‌రెడ్డి, సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి పా ల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. వాటికి రక్షణగా ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళ ప్ప, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి జాన్‌, ఉపాధి ఏపీవో ఎల్లయ్య, ఈసీ శ్రీనివాసులు పాల్గొన్నారు.

ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు
మంత్రి కేటీఆర్‌ జన్మదిన వేడుకలను టీఆర్‌ఎస్‌ నాయకులు ఘనంగా జరుపుకొన్నారు. సర్పంచ్‌ సూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలు, ప్రజలకు పం చి పెట్టారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ ఇబాదుల్‌ రహిమా న్‌, వార్డు సభ్యులు, మైనార్టీ నాయకులు, ఐకేపీ సి బ్బంది పాల్గొన్నారు.

కేక్‌ కట్‌ చేసిన ఎమ్మెల్యే
మక్తల్‌ టౌన్‌, జూలై 24 : మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని పట్టణంలోని ఎ మ్మెల్యే నివాసంలో కార్యకర్తల సమక్షంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి కేక్‌ కట్‌ చేసి కార్యకర్తలకు తి నిపించారు. అనంతరం మైనార్టీ గురుకుల పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్‌ నిజాంపాషా, జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజాగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రాజేశ్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, మాగనూర్‌ అధ్యక్షుడు ఎల్లారెడ్డి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి మొక్కనూ సంరక్షించాలి
దామరగిద్ద, జూలై 24 : నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఎస్పీ డాక్ట ర్‌ చేతనతో కలిసి మొక్కలు నాటారు. మండలంలో ని ప్రతి గ్రామంలో నాటిన ప్రతి మొక్క చెట్టుగా మా రాలన్నారు. అనంతరం మండలంలోని వివిధ గ్రా మాలకు సంబంధించిన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎల్‌వో సీ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. విఠలాపూర్‌లో మిషన్‌ భగీరథ పైప్‌లైన్‌ పనుల గురించి అ డిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నర్సప్ప, సర్పంచ్‌ ఆశమ్మ వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.

మరికల్‌ మండలంలో…
మరికల్‌, జూలై 24 : మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ మం డల అధ్యక్షుడు తిరుపతయ్య ఆధ్వర్యంలో నాయకులు కేక్‌ కట్‌ చేశారు. అనంతరం సర్వే నంబర్‌ 1లో మొక్కలు నా టారు. కార్యక్రమంలో సర్పంచ్‌ గోవర్ధన్‌, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు మతీన్‌, నాయకు లు, ఉపసర్పంచ్‌ శివకుమార్‌, వార్డు సభ్యులు, పట్టణ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ధన్వాడ మండలంలో…
ధన్వాడ, జూలై 24 : మంత్రి కేటీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని మండలంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. అ నంతరం సాయిబాబా ఆలయం వద్ద, ప్రభుత్వ దవాఖాన వద్ద, గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. అదేవిధంగా ఎంనోన్‌పల్లిలో కేక్‌ కట్‌ చేసి మొక్క లు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ అమరేందర్‌రెడ్డి, టీ ఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మురళీధర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్‌ వెంకట్రామ్‌రెడ్డి, నాయకులు, పంచాయతీ సిబ్బందితోపాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు
నారాయణపేట, జూలై 24 : టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావు జన్మదిన వేడుకలను పట్టణంలో ఘనంగా జరుపుకొన్నారు. ఎమ్మెల్యే ఎస్‌. రాజేందర్‌రెడ్డి పట్టణంలోని షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు.

ప్రతి మొక్కనూ రక్షించాలి
నాటిన ప్రతి మొక్కనూ రక్షించాలని ఎమ్మెల్యే ఎస్‌.రా జేందర్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా ఎం పీ సంతోష్‌కుమార్‌ పిలుపుమేరకు ముక్కోటి వృక్షార్చనలో భాగంగా పేట నియోజకవర్గంలో ఒకేరోజు 2 లక్షల మొక్కలను నాటారు. అందులో భాగంగా మండలంలోని పిల్లిగుండ్ల తండాలో 15 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్‌ ప లె ్లప్రకృతి వనంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు, తండావాసులతో కలిసి మొక్కలు నాటారు. తండాలో నెలకొన్న రెవెన్యూ, అటవీశాఖల భూ సమస్యను వారం రోజుల్లో కొలతలు చేపట్టడంతో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana