e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జోగులాంబ(గద్వాల్) భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురుపౌర్ణమి వేడుకలు

మహబూబ్‌నగర్‌, జూలై 24 : గురుపౌర్ణమి వేడుకలను శనివారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. మన్యంకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు జి ల్లా కేంద్రంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మ న్యంకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈవో శ్రీనివాసరాజు, పర్యవేక్షకుడు నిత్యానందాచారి పాల్గొన్నారు.

జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్ల, జూలై 24 :గురుపౌర్ణమి సందర్భంగా జడ్చర్లలోని సకలదేవతల ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి పల్లకీసేవతోపాటు లక్ష్మీనరసింహస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. అలాగే సాయినగర్‌కాలనీ సా యిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు చే శారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పా లాది రమేశ్‌, ఎంఈవో మంజులాదేవి, పల్ల వి, శారద, యాదమ్మ, రాఘవేందర్‌, శ్రీనివాసులు, రాజనర్సింహులు, రఘు, సంతో ష, జయమ్మ, కృష్ణారావు పాల్గొన్నారు.

- Advertisement -

బాలానగర్‌ మండలంలో..
బాలానగర్‌, జూలై 24 : మండల కేం ద్రంతోపాటు పలు గ్రామాల్లో గురుపౌర్ణమి వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. గౌతాపూర్‌లో విజయ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.

హన్వాడ మండలంలో..
హన్వాడ, జూలై 24 : మండలకేంద్రంతోపాటు సల్లోనిపల్లి, ఇబ్రహీంబాద్‌, వేపూ ర్‌ తదితర గ్రామాల్లో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా గురువులను పూలమాల, శాలువా తో సన్మానించారు. కార్యక్రమంలో సర్పంచులు వసంత, సత్యమ్మ పాల్గొన్నారు.

ఉపాధ్యాయులకు సన్మానం
మహబూబ్‌నగర్‌టౌన్‌, జూలై 24 : గురుపౌర్ణమిని పురస్కరించుకొని హౌసింగ్‌బోర్డుకాలనీలోని ఎస్‌ఆర్‌ ప్రైమరీ స్కూల్‌ ఉపాధ్యాయులను విద్యార్థులు సన్మానించారు. అదేవిధంగా వాగ్దేవి జూనియర్‌ కళాశాల కరస్పాండెంట్‌ విజేత వెంకట్‌రెడ్డిని పూర్వ విద్యార్థి శివకుమార్‌ సన్మానించారు. కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌జీ, పట్టణ అధ్యక్షురాలు మాధవి, జిల్లా సంయుక్త కార్యదర్శి అక్తర్‌బేగం, నజియాసుల్తానా, భానుప్రతాప్‌, మల్లికార్జున్‌, సాహేబ్‌హుస్సేన్‌ పాల్గొన్నారు.

మూసాపేట మండలంలో..
మూసాపేట, జూలై 24 : అడ్డాకుల, మూసాపేట మండలాల్లోని పలు ఆలయా ల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కందూ రు స్టేజీ దగ్గరున్న షిర్డీ సాయిబాబా ఆలయంలో సామూహిక హోమం, అభిషేకా లు, అర్చన చేశారు. మూసాపేట, నిజాలాపూర్‌ గ్రామాల్లోని సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జానంపేటకు చెందిన విశ్రాంత ఆర్డీవో హన్మంత్‌రెడ్డి, మల్లు రజిత చక్రాపూర్‌ స్టేజీ దగ్గర ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు.

కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, జూలై 24 : మండలంలోని మల్కాపూర్‌, కోయిలకొండ మాణికేశ్వరి ఆశ్రమంలో గురుపౌర్ణమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాణికేశ్వరి మాతకు పాదపూజ, గాయత్రీహోమం తదితర పూజలు చేశారు. మండల కేంద్రంలోని ఆది ఆంజనేయస్వామి ఆలయంలో వ్యాసపూజ, సామూహిక సత్యనారాయణస్వామివ్రతం నిర్వహించారు.

నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, జూలై 24 : మండలకేంద్రంలోని సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణ మి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, భక్తులు సాయిబాబాను దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana