నాగర్కర్నూల్, జూలై 13 (నమస్తే తెలంగాణ) : రైతన్నలకు పంటల బీమా పథకం చేయూతనందించనున్నది. ఆరుగాలం కష్టించి సేద్యం చేసే రైతన్నకు ప్రకృ తి ప్రకోపాల వల్ల కలిగే నష్టాన్ని భర్తీ చే యడం అసాధ్యం. అయితే, పంటల బీ మా ఈ నష్టాన్ని ప్రత్యామ్నాయంగా భర్తీ చేయనున్నది. అప్పులు చేసి రేయింబవళ్లు కష్టపడి వ్యవసాయం చేసే రైతన్నలు ఈ పంటల బీమా నుంచి లబ్ధి పొందనున్నా రు. పంటలు మంచిగా ఎదిగినా వర్షాలు, వరదలతో దెబ్బతింటే ఈ బీమాతో రైతులకు ఆర్థికంగా ఊరట కలగనున్నది. దీనికిగానూ ప్రభుత్వం ప్రతి ఏడాది రైతుల నుంచి ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా పరిహారం ఇప్పించేలా చర్యలు చేపడుతున్న ది. ఇలా ప్రస్తుత వానకాలంలో రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
రైతులు తా ము పండించిన పంటలకు ఎకరా చొప్పు న ప్రీమియం ధరను నిర్ణయించింది. పం ట కాలానికి సంబంధించి నిర్ణయించిన వాతావరణ అంశాలకు, ప్రస్తుత పంట కాలంలో టీఎస్డీపీఎస్ ద్వారా మండల స్థాయిలో ఏర్పాటు చేసిన వాతావరణ కేంద్రాల్లో నమోదైన వాతావరణ అంశాల కు వ్యత్యాసం ఉంటే తగిన పరిహారం బీ మా మొత్తం నుంచి చెల్లించనున్నారు. బ్యాంకులో రుణం తీసుకున్న, కౌలు రైతులతో సహా అందరూ అర్హులే. ఏఐసీ నిర్ణయించిన బీమా మధ్యవర్తులు, మైక్రో ఇ న్సూరెన్స్ ఏజెంట్ల ద్వారా బీమా పొందే అవకాశం ఉన్నది. జిల్లాలో పత్తి, మిరప, వరి, మొక్కజొన్న, కందులు వంటి పంటలకు నష్ట పరిహారం పొందొచ్చు. ఈ పంటలకు సంబంధించిన ప్రీమియం చెల్లింపు రుసుమును కూడా ప్రభుత్వం నిర్ణయించింది.
నాగర్కర్నూల్ జిల్లాలో వ్యవసా య శాఖ సాధారణంగా ఈ సీజన్లో 2, 73,927 హెక్టార్లలో పంటల సాగు జరుగుతుందని అంచనా. ఇందులో అత్యధికంగా 2,29,540 హెక్టార్లలో పత్తి సాగవుతుందని తెలుస్తున్నది. ఆ తర్వాత 20 వేల హెక్టార్లలో కందులు, 13,320 హెక్టార్లలో వరి సాగు కానున్నది. వచ్చే నెలలో పంటల గణన తర్వాత పూర్తి స్థాయిలో సాగుపై అధికారులు అభిప్రాయానికి రా నున్నారు. కాగా బీమాతో జిల్లాలో అత్యధికంగా పత్తి రైతులకు లబ్ధి చేకూరనున్నది. అధిక వర్షపాతాలతో చీడపీడ లు, నీళ్లు నిలిచి పంటలు నష్టపోవ డం, వర్షాలు లేకుంటే ఎండిపోవ డం వంటి కారణాలతో ఆయా పంటలకు నష్టం కలిగే అవకా శం ఉంటుంది. ఈ నష్టాలకు వానకాలం పంటల బీమా చేయూతను ఇస్తుంది.
రైతులకు ఎంతో మేలు..
పంటల బీమాతో రైతులకు మేలు కలగనున్నది. వానకాలంలో పంటల బీమా ప్రీమియం ఖరారు చేశారు. ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించాం. ఈనెల 15వ తేదీ వరకు రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.