e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జోగులాంబ(గద్వాల్) ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

సింగిల్‌ విండో చైర్మన్‌ తిమ్మారెడ్డి
మల్దకల్‌, ఏప్రిల్‌ 27 : మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సింగిల్‌ విండో అధ్యక్షుడు శేషంపల్లి తిమ్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ రాజారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సింగిల్‌ విండో చైర్మన్‌ తిమ్మారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఆదేశాల ప్రకారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామన్నారు. అయితే మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు పండించిన ప్రతి గింజనూ కొనుగోలు చేస్తామన్నారు. ప్రభుత్వం క్వింటాకు ఏగ్రేడ్‌ ధర రూ.1,888, సాధారణ ధర రూ.1,868లుగా నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ అజంఅలీ, ఎంపీపీ రాజారెడ్డి, వైస్‌ ఎంపీపీ పెద్ద వీరన్న, మండల కోఆష్షన్‌ సభ్యుడు హైదర్‌అలీ, ఏవో రాజశేఖర్‌, సర్పంచులు యాకోబు, వెంకటేశ్వర్‌రెడ్డి, ఆంజనేయులు, వీరేశ్‌నాయక్‌, ప్రతాప్‌, ఎంపీటీసీ రాజు, పద్మమ్మ, నాయకులు మధుసూదన్‌రెడ్డి, సీతారామిరెడ్డి, అజయ్‌, వెంకటన్న, నరేందర్‌, మధు, చంద్రశేఖర్‌రెడ్డి, తిమ్మరాజు, పరశురాముడు, గోవింద్‌, రైతులు, ఏఈవో పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం

ట్రెండింగ్‌

Advertisement