e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home జిల్లాలు లాక్‌డౌన్‌ కట్టుదిట్టం

లాక్‌డౌన్‌ కట్టుదిట్టం

లాక్‌డౌన్‌ కట్టుదిట్టం

అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు నమోదు చేస్తున్న పోలీసులు
లాక్‌డౌన్‌ను పర్యవేక్షించిన అదనపు కలెక్టర్‌, ఎస్పీ

గద్వాల,మే 22: కరోనా కట్టడిలో భాగంగా శనివారం జిల్లా కేంద్రంతోపాటు ఆయా మండల కేంద్రాల్లో లాక్‌డౌన్‌ను కట్టుదిట్టం చేశారు. ఉదయం 10 గంటల తర్వాత కారణం లేకుండా రోడ్లపైకి వస్తే పోలీసులు కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం పండుగ సీజన్‌ కావడంతో వస్ర్తా దుకాణాల యజమానులు దుకాణాలు మూసి లోపల వ్యాపారం చేస్తున్నారు. దీనిని మరింత కట్టడి చేసి కరోనాను అరికట్టడానికి పోలీసులు కృషి చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో అమలవుతున్న లాక్‌డౌన్‌ను వేర్వేరుగా ఎస్పీ రంజన్త్రన్‌కుమార్‌ స్వయంగా బుల్లెట్‌ నడుపుతూ వీధుల్లో పర్యటించి లాక్‌డౌన్‌ పర్యవేంక్షించారు. అదనపు కలెక్టర్‌ రఘురాం శర్మ లాక్‌డౌన్‌ జిల్లా కేంద్రంలో ఎలా అమలవుతుందో అధికారులతో కలిసి పర్యవేక్షణ చేశారు. అలాగే మున్సిపల్‌ చైర్మన్‌ కేశవ్‌, కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి దుకాణాలను పరిశీలించారు.
గట్టులో..
గట్టు, మే 22 : లాక్‌డౌన్‌ పకడ్బందీ అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై మంజునాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ సడలింపు సమయం తరువాత అనుమతులు లేకుండా బయటకు వస్తే కేసులు నమోదుచేసి వాహనాలు సీజ్‌ చేస్తామని స్పష్టంచేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా తిరుగుతున్న 14 వాహనాలను సీజ్‌ చేసి పీఎస్‌కు తరలించి జరిమానాలు విధించినట్లు చెప్పారు. లాక్‌డౌన్‌ అమలుకు ప్రతిఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అతిక్రమిస్తే కఠిన చర్యలు
ఇటిక్యాల, మే 22 : లాక్‌డౌన్‌ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్‌డౌన్‌ అమలు కఠినతరం చేసేందుకు గాను శనివారం తాసిల్దార్‌ కార్యాలయంలో సర్వేలెన్స్‌ టీం సభ్యులతో ఆయన సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి రోజూ ఉదయం 10 గంటల కంటే 15 నిమిషాలు ముందుగా దుకాణాలు మూసి వేయాలని, అలాగే గ్రామాల్లో కొవిడ్‌ నిబంధనల అమలుపై వీఆర్‌ఏల సహకారం తదితర అంశాలను చర్చించారు. ముఖ్యంగా ఎర్రవల్లి చౌరస్తాలోని గద్వాల రోడ్డుపై తాత్కాలిక చెక్‌పోస్ట్‌ను ఏర్పాటుచేసి నిబంధనలు అతిక్రమించే వాహనదారులను కట్టడిచేయాలని నిర్ణయించారు. కార్యక్రమంలో తాసిల్దార్‌ సుబ్రమణ్యం, ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి, వైద్యాధికారి తబ్సమ్‌బేగం, ఆర్‌ఐ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
లాక్‌డౌన్‌ పక్కాగా అమలు చేయాలి
అలంపూర్‌, మే 22 : కొవిడ్‌ వైరస్‌ వ్యాప్తిని అరికట్టే విషయంలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా ఉంటూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని తాసిల్దార్‌ మదన్‌ మోహన్‌ రావు అన్నా రు. శనివారం వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉదయం పది గంటల తర్వాత ఎవరూ బయట రావొద్దని, వ్యాపారులు సైతం 15 నిమిషాల ముందే వారి వ్యాపారాలను కట్టివేసి పది గంటల వరకు ఇండ్లకు చేరుకునే విధంగా ఉండాలన్నారు. సమీక్ష అనంతరం పట్టణంలో తిరిగి లాక్‌డౌన్‌ పరిస్థితులను పరిశీలించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ, కమిషనర్‌ రాజు, మండల వైద్యాధికారి రామచంద్రారెడ్డి, ఎంపీడీవో సుగుణకుమార్‌ ఎస్సై మధుసూదన్‌రెడ్డి, రెవెన్యూ సీనియర్‌ అసిస్టెంట్‌ గురురాజు, ఆర్‌ఐ కరీం, ఆలయ కమిటీ చైర్మన్‌ రవి ప్రకాశ్‌గౌడ్‌, ధర్మకర్త వెంకటరామయ్యశెట్టి, వీఆర్వో వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
మద్యం అక్రమ విక్రయాలను అరికట్టాలి
వడ్డేపల్లి, మే 22: లాక్‌డౌన్‌ సమయంలో గ్రామాల్లో అక్రమంగా వెలసిన బెల్టు దుకాణాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని, దీనిపై ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు కూడా దృష్టిసారించి పోలీసులకు సమాచారమిచ్చి అక్రమ మద్యం విక్రయాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ విషయమై ఎస్సై శ్రీహరిని వివరణ కోరగా కరోనా వ్యాప్తిని అరికట్టండంలో భాగంగా ట్రైనీ ఎస్సై శేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ రాజవర్ధన్‌రెడ్డి, వెంకప్ప తదితరులతో కలసి అనవసరంగా రోడ్లమీదకు వ స్తున్న బైక్‌లు, నిబంధనలను అతిక్రమించిన వారికి జరిమానా విధించి, వాహనాలు సీజ్‌ చేస్తున్నామని, అక్రమ మద్యం విక్రయాలపై మా దృష్టికి తెస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై అన్నారు.
అయిజలో..
అయిజ, మే 22 : మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతున్నది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకు సడలింపు సమయం ఉండడంతో ఆ సమయంలోనే నిత్యావసరాలను కొనుగోలు చేసి ఇండ్లకే పరిమితం అవుతున్నారు. ఇందులో భాగంగా 20 వాహనాలను సీజ్‌ చేసినట్లు ఎస్సై జగదీశ్వర్‌ తెలిపారు.
లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం..
ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ మరింత కట్టుదిట్టం చేస్తున్నట్లు శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం అయిజ మండలంలోని వెంకటాపూర్‌ స్టేజీలో లాక్‌డౌన్‌ను సీఐ పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎస్సై జగదీశ్వర్‌, ప్రొబీషనరీ బాలరాజు, పోలీసులు పాల్గొన్నారు.
బయటకు వస్తే చర్యలు
లాక్‌డౌన్‌ సమయంలో అనవసరంగా బయటకు వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తాసిల్దార్‌ యాదగిరి పోలీసులను ఆదేశించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం తాసిల్దార్‌ కార్యాలయంలో లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష చేశారు. ఈ సందర్భంగా తాసిల్దార్‌ మాట్లాడుతూ ఉదయం 6 గం టల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యావసరాల కొనుగోలుకు అనుమతించాలన్నారు. సమావేశంలో శాంతినగర్‌ సీఐ వెంకటేశ్వర్లు, ము న్సిపల్‌ చైర్మన్‌ చిన్నదేవన్న, గ్రంథాలయ సంస్థ జి ల్లా చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, సింగిల్‌ విండో చైర్మన్‌ మధుసూదన్‌రెడ్డి, ఎంపీవో నర్సింహారెడ్డి, ఎస్సై జగదీశ్వర్‌, కమిషనర్‌ వేణుగోపాల్‌, ఆర్‌ఐ మద్దిలేటి, ఎంపీహెచ్‌ఈవో ఓబులేశ్వరయ్య ఉన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
లాక్‌డౌన్‌ కట్టుదిట్టం

ట్రెండింగ్‌

Advertisement