e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home జోగులాంబ(గద్వాల్) విరివిగా మొక్కలు నాటాలి

విరివిగా మొక్కలు నాటాలి

విరివిగా మొక్కలు నాటాలి

మానవపాడు, జూన్‌ 21 : అడవులను తలపించేలా విరివిగా మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని జాతీయ రహదారిపై అదనపు కలెక్టర్‌ శ్రీహర్షతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ రహదారుల వెంట, ఖాళీ ప్రదేశాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. పల్లెలను పచ్చదనంతో కళకళలాడేలా చూడాలన్నారు. అధికారులు కూడా మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అలంపూర్‌ చౌరస్తా నుం చి రాయిచూర్‌ వెళ్లే రహదారిపై కూడా మొక్కలు నాటాలన్నా రు. కార్యక్రమంలో డీఆర్డీవో అదనపు ముఖ్య కార్యదర్శి నాగేంద్రం, సర్పంచ్‌ హైమావతి, నాయకులు పాల్గొన్నారు.
ఉండవెల్లిలో..
ఉండవెల్లి, జూన్‌ 21 : మండలంలోని అలంపూర్‌ చౌరస్తాలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం బాధితులకు ఎమ్మెల్యే అబ్రహం సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అయిజ మండలానికి చెందిన ఆరుగురికి రూ.1.47 లక్షలు, ఇటిక్యాల మండలానికి చెందిన నలుగురికి రూ.63వేల విలువ గల చెక్కులు పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో నాయకులు రమణ, దేవరాజు పాల్గొన్నారు.
ఉర్సు ఉత్సవానికి ఆహ్వానం
అలంపూర్‌లో జూలై 3 నుంచి 6వ తేదీ వరకు జరిగే షావలీ పైల్వాన్‌ దర్గా ఉత్సవాలకు హాజరు కావాలని ఎమ్మెల్యే అబ్రహంను నిర్వాహకులు, మున్సిపల్‌ కో ఆప్షన్‌ సభ్యుడు అల్లాబకాస్‌ ఆహ్వానించారు.
జయశంకర్‌ సార్‌కు నివాళి..
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ వర్ధంతిని క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే నిర్వహించారు. జయశంకర్‌ సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
విరివిగా మొక్కలు నాటాలి
విరివిగా మొక్కలు నాటాలి
విరివిగా మొక్కలు నాటాలి

ట్రెండింగ్‌

Advertisement