e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, August 4, 2021
Home జోగులాంబ(గద్వాల్) రైతురాజ్య నిర్మాత సీఎం కేసీఆర్‌

రైతురాజ్య నిర్మాత సీఎం కేసీఆర్‌

రైతురాజ్య నిర్మాత సీఎం కేసీఆర్‌

ధరూర్‌, జూన్‌ 15 : సీఎం కేసీఆర్‌ రైతురాజ్యం నిర్మించే నిర్మాతగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అభివర్ణించారు. రైతుబంధు పథకం విడుదల సందర్భంగా మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద శ్రీనివాస్‌రెడ్డి ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి ఎమ్మెల్యే బండ్ల క్షీరాభిషేకం చేశారు. అదేవిధంగా మండలంలోని మార్లబీడు, నీలహల్లి, పారుచర్ల, గార్లపాడు, చింతరేవుల, ఉప్పేరు గ్రామాల్లో రైతులు సంబురాలు జరుపుకొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో కూడా రైతులకు ఇబ్బంది కలగకుండగా రూ.7,509కోట్లు పెట్టుబడి సాయం అందించి రైతు పక్షపాతిగా కేసీఆర్‌ నిలిచారని తెలిపారు. ప్రపంచస్థాయిలో రైతు ఉత్పత్తులకు డిమాండ్‌ కల్పించి, దేశంలో కేంద్ర పథకాలకు తెలంగాణ రైతు సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలిచేలా రూపొందించిన నిర్మాత అని కొనియాడారు. ఈ నెల 25వ తేదీ వరకు ప్రతి రైతు ఖాతాలో సొమ్ము జమ అవుతుందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, ఎంపీపీ నజుమున్నిసాబేగం, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, మార్కెట్‌ యార్డు వైస్‌ చైర్మన్‌ సంజీవులు, సర్పంచ్‌ పద్మమ్మ, ఎంపీటీసీ దౌలన్న, మార్కెట్‌ డైరెక్టర్‌ నర్సింహులు, పార్టీ నాయకులు జాకీర్‌, జాంపల్లె వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీధర్‌, రాజారెడ్డి, దర్శెల్లి, మల్లికార్జున్‌రెడ్డి, జిల్లా సమన్వయకర్త పురుషోత్తంరెడ్డి, సీతారాములు, చిరు, భాస్కర్‌రెడ్డి, గ్రామస్తులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు.

రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ
రాష్ర్టానికి కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం వ్యవసాయం నిరంతరం పండగలా కొనసాగుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని అల్వాల్‌పాడులో రైతువేదిక వద్ద సర్పంచ్‌ వీరన్నగౌడ్‌ నిర్వహించిన ధరూరు, కేటీదొడ్డి మండలాల రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు. రెండు మండలాలకు కలిపి 198మంది రైతులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వ్యవసాయ పరికరాలు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పీఎంకేఎస్‌వై ద్వారా అందించే వ్యవసాయ పరికరాలను రైతులు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, జెడ్పీటీసీలు పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, రాజశేఖర్‌, ఎంపీపీలు నజుమున్నిసాబేగం, మనోరమ, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, రామకృష్ణనాయుడు, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఈశ్వరయ్య, మార్కెట్‌ డైరెక్టర్‌ నర్సింహులు, పార్టీ నాయకులు జాకీర్‌, జాంపల్లె వెంకటేశ్వర్‌రెడ్డి, శ్రీరాములు, వెంకటేశ్‌గౌడ్‌, మహేశ్‌, సమన్వయకర్తలు పురుషోత్తంరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రైతురాజ్య నిర్మాత సీఎం కేసీఆర్‌
రైతురాజ్య నిర్మాత సీఎం కేసీఆర్‌
రైతురాజ్య నిర్మాత సీఎం కేసీఆర్‌

ట్రెండింగ్‌

Advertisement