e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, July 27, 2021
Home జోగులాంబ(గద్వాల్) సీఎం కేసీఆర్‌ వల్లే రైతులకు గౌరవం

సీఎం కేసీఆర్‌ వల్లే రైతులకు గౌరవం

సీఎం కేసీఆర్‌ వల్లే రైతులకు గౌరవం

గద్వాల, జూన్‌ 15 : సీఎం కేసీఆర్‌ రైతుల పక్షపాతి, ఆయన ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో రైతులకు గౌరవం పెరిగిందని మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ అన్నారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ కావడం వల్ల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డులో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్మన్‌ హాజరై మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌తో కలిసి క్షీరాభిషేకం చేసి మిఠాయిలు పంచిపెట్టారు. కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సంజీవులు, కౌన్సిలర్లు మురళి, నాగిరెడ్డి, మహేశ్‌ నాయకులు యూసూఫ్‌, నజీర్‌ ధర్మనాయిడు, రాము, సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.

గద్వాల మండలంలో..
గద్వాల రూరల్‌, జూన్‌ 15: రైతుల పక్షపాతిగా సీఎం కేసీఆర్‌ చరిత్రలో నిలిచిపోయారని ఎంపీపీ ప్రతాప్‌గౌడ్‌ పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కొండపల్లిలో రైతు వేదిక వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రైతుల పక్షపాతిగా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మహేశ్వరమ్మ సత్యనారాయణ, గోపిరెడ్డి, సత్యనారాయణ, నర్సింహులు, గోపాల్‌, సర్వేశ్‌, ప్రభాకర్‌రెడ్డి బలరాముడు, కర్ణాకర్‌, తిరుపతిరెడ్డి, నారాయణరెడ్డి, కిష్టన్న, శేషన్న తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

సీఎం కేసీఆర్‌ రైతుబాంధవుడు
గట్టు, జూన్‌ 15 : రైతుబంధుతో సీఎం కేసీఆర్‌ రైతు బాంధవుడయ్యాడని ఎంపీపీ విజయ్‌కుమార్‌, జెడ్పీటీసీ బాసు శ్యామల పేర్కొన్నారు. మండలంలోని ఆలూరు, బలిగేర రైతువేదికల వద్ద మంగళవారం ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో వారు వేర్వేరుగా సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమాల్లో వారు పాల్గొని మాట్లాడారు. రైతుబంధు పథకాన్ని ఏడోసారి కూడా దిగ్విజయంగా అమలు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. గట్టు, మాచర్ల, మిట్టదొడ్డితోపాటు పలు గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీల ఆధర్యంలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమాల్లో పీఏసీసీఎస్‌ చైర్మన్‌ క్యామ వెంకటేశ్‌, సర్పంచులు, ఎంపీటీసీలు, బలిగేర హన్మంతు, కుర్వ మల్లమ్మ, కృష్ణవేణి, ఆనంద్‌గౌడ్‌, రూపవతి, టీఆర్‌ఎస్‌ నాయకులు రామకృష్ణారెడ్డి, జగదీశ్వర్‌రెడ్డి, మేస్త్రీ తిమ్మప్ప, కర్రెప్ప, బస్సప్ప, బజారి, నరేంద్ర నాయక్‌ పాల్గొన్నారు.

సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
మల్దకల్‌, జూన్‌ 15: రైతుల పక్షపాతి, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాల్లో మంగళవారం టీఆర్‌ఎస్‌, రైతులు సమక్షంలో క్షీరాభిషేకం చేశారు. మండల కేంద్రంలో రైతువేదిక వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీపీ రాజారెడ్డి, జెడ్పీటీసీ ప్రభాకర్‌రెడ్డి హాజరయ్యారు. అలాగే ఎల్కూర్‌, కుర్తిరావుల చెర్వు, మల్దకల్‌, మల్లెందొడ్డి, పాల్వాయి, బిజ్వారం, విఠలాపురం, మద్దెలబండ, అమరవాయి తదితర గ్రామాల్లో సీఎం చిత్రపటానికి సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, నాయకులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పెద్దవీరన్న, సింగిల్‌విండో అధ్యక్షుడు తిమ్మారెడ్డి, కోఆష్షన్‌ సభ్యుడు హైదర్‌, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహులు, సర్పంచులు యాకోబు, వెంకటేశ్వర్‌రెడ్డి, నాయకులు వెంకటన్న, నరేందర్‌, నారాయణ, మధు, పరుశరాముడు, తిమ్మరాజు, నర్సింహరెడ్డి, పటేల్‌ జనార్దన్‌రెడ్డి, మహబూబ్‌అలీ, భాస్కర్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

కేటీదొడ్డి మండలంలో..
కేటీదొడ్డి, జూన్‌ 15 : రైతుబంధు నగదు రైతుల ఖాతాల్లో జమ కావడంతో మండల రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అందులో భాగంగా టీఆర్‌ఎస్‌ నాయకులు, రైతులు రైతువేదికల వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ రామకృష్ణనాయుడు, నాయకులు ఉరుకుందు, వెంకటేశ్‌గౌడ్‌, యుగేందర్‌గౌడ్‌, రంగారెడ్డి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సీఎం కేసీఆర్‌ వల్లే రైతులకు గౌరవం
సీఎం కేసీఆర్‌ వల్లే రైతులకు గౌరవం
సీఎం కేసీఆర్‌ వల్లే రైతులకు గౌరవం

ట్రెండింగ్‌

Advertisement