దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
మూసాపేట(అడ్డాకుల), జూన్ 11 : ఆపత్కాలంలో తోటి వారికి చేయూత అందించడం అభినందనీయమని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. అడ్డాకులలో రెవెన్యూ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, విలేకరులకు శానిటైజర్లు, ఫ్రూట్జూస్, మాస్కు లు, డ్రైఫ్రూట్స్ ఎమ్మెల్యే ఆల అందజేశారు. అదేవిధంగా సహాయ ఫౌండేషన్ మండల ఉపాధ్యక్షుడు వన్నం కార్తీక్ 11మార్లు రక్తదానం చేయడంపై అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ నల్లమద్ది రాజశేఖర్‌రెడ్డి, ఎంపీపీ దోనూరు నాగార్జున్‌రెడ్డి, ఎస్సై నరేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్‌రెడ్డి, మహిళా సెల్ అధ్యక్షురాలు సుజాత, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ సంస్థ ప్రతినిధులు తదిత రులు పాల్గొన్నారు.
కాల్వల మరమ్మతుకు చర్యలు
దేవరకద్ర రూరల్, జూన్ 11 : వ ర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని చెరువులు, వాగులకు అనుసంధానంగా ఉ న్న కాల్వల మరమ్మతుకు చర్యలు తీ సుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలం వడ్డెమాన్ గ్రామం నుంచి చిన్నచింతకుంట చెరువు వరకు ఉన్న కడ్తాల్ కాల్వను శుక్రవారం పరిశీలించారు. కాల్వల మరమ్మతులకు ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం వడ్డెమాన్-ఉంద్యాల మన్నె వాగులో కాజ్వే నిర్మాణానికి పరిశీలన చేశారు. వర్షాలు రాకముందే కాల్వల మరమ్మతు పనులను పూర్తి చేస్తే చెరువులకు సాఫీగా నీరు చేరుతుందని తెలిపారు. ఎమ్మెల్యే వెంట మండల నాయకులు ఉన్నారు.