e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జిల్లాలు మృగశిర ఆరంభం..రుతుపవన సందేశం

మృగశిర ఆరంభం..రుతుపవన సందేశం

మృగశిర ఆరంభం..రుతుపవన సందేశం

విత్తనాలు వేసేందుకు రైతన్న సిద్ధం
భారీ వర్షాలకోసం ఎదురుచూపు
నేడు మృగశిరకార్తె

పెద్దమందడి, జూన్‌ 7 : నిన్నటివరకు ఎండలతో హడలెత్తించిన రోహిణికార్తె ముగిసి మంగళవారంతో మృగశిరకార్తె ప్రారంభం కానున్నది. ఈ కార్తెలో రుతుపవనాల ప్రవేశంతో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల నమ్మకం. వర్షాలు పడగానే విత్తనాలు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే వ్యవసాయానికి అవసరమైన పనిముట్లు, విత్తనాలు, ఎరువులు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల తొలకరి జల్లులు పలకరించినా మృగశిరకార్తెలో భారీ వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
మృగశిరకార్తె ప్రాముఖ్యత
మృగశిర నక్షత్రం దేవగణానికి చెందినది. దీనికి అధిపతి కుజుడు. ఈ నక్షత్రంలో జన్మించినవారు మంచి అదృష్టం కలిగివుంటారని భావిస్తారు. పూర్వం వైశంపాయనుడు మృగశిరకార్తె రోజునే తన శిష్యుడైన యజ్ఞవల్క్యునికి తైత్తిరీయోపనిషత్తు బోధించాడని అంటారు. ఈ ఉపనిషత్తు వర్షాధిపతి అయిన వరుణదేవుడి ప్రార్థనతో ప్రారంభమవుతుంది. అటు పరమాత్మకు, ఇటు లౌకిక వ్యవహారాలకు మధ్య మృగశిరకార్తెను సంధానకర్తగా భావిస్తారు. తొలకరి జల్లుల సమయంలో భూమిపై నుంచి వచ్చే పరిమళం జీవరాశులన్నింటికీ ఆనందం కలిగిస్తుంది. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు వర్షపు జల్లుల అనంతరం ధరణి నుంచి ఉద్భవించి వ్యాపించే పరిమళాన్ని తానేనని వివరిస్తాడు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి మానవుల్లో ఓజస్సు, తేజస్సు మృగశిరకారై అనంతరం అధికం అవుతాయని జీవకుడనే పూర్వకాలం నాటి వైద్యుడు గ్రంథస్థం చేశాడు.
మొదటిరోజు పండుగ..
మృగశిరకార్తె మొదటి రోజున ప్రజలు వివిధ ప్రాం తాల్లో మృగశిర, మృగం, మిరుగు, మిర్గంపేర్లతో పండుగ జరుపుకొంటారు. అలాగే బెల్లంలో ఇంగువ కలిపి తింటారు. ఇంగువ శరీరంలో వేడిని అధికం చేసి వర్షకాలంలో వచ్చే జలుబు, ఇతర వ్యాధులను నియంత్రిస్తుందని నమ్మకం. అలాగే మృగశిరకార్తె ప్రారంభం రోజు చేపలు, ఇతర మాంసాహారం తింటే వ్యాధులు దూరమవుతాయని ప్రజలు భావిస్తారు.
మొత్తం 27 కార్తెలు..
సూర్యుడు ఒక్కో నక్షత్రం సమీపంలో 14 రోజులపాటు ఉంటాడు. సూర్యుడు ఏ నక్షత్రానికి సమీపంలో ఉంటే ఆ కాలానికి (కార్తె) ఆ నక్షత్రం పేరు పెట్టారు. ఈ కార్తెలు ఆంగ్ల క్యాలెండర్‌ ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం ఒకే తేదీల్లో వస్తాయి. మొత్తం 27 నక్షత్రాల పేర్లతో కార్తెలు ఉన్నాయి. అశ్వినితో ప్రారంభమై రేవతితో ముగుస్తాయి. అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరు ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జేష్ట్య,మూల, పూర్వాషాడ, ఉత్తరాషాడ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పుర్వాబాధ, ఉత్తరాబాధ, రేవతికార్తెలు ఉన్నాయి.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మృగశిర ఆరంభం..రుతుపవన సందేశం

ట్రెండింగ్‌

Advertisement