e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home జిల్లాలు పేదలకు చేయూత

పేదలకు చేయూత

పేదలకు చేయూత

మహబూబ్‌నగర్‌, మే 31 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో పేదలకు తమవంతు చేయూత అందిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్‌ టీ ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లెపోగు శ్రీనివాస్‌మాదిగ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని న్యూటౌన్‌, తెలంగాణ చౌరస్తా తదితర ప్రాంతాల్లో బాటసారులకు భోజనం అందజేశారు. ఎవరూ ఆకలితో బాధపడొద్దన్న ఉద్దేశంతో భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. మరింత మందికి సా యం చేసేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో యాదగిరి, సాయి పాల్గొన్నారు.
కార్మికులకు సరుకులు పంపిణీ
మహబూబ్‌నగర్‌ టౌన్‌, మే 31 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరహనుమాన్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో 47వ వా ర్డులో మున్సిపల్‌ కార్మికులకు నిత్యావసర సరుకులు పం పిణీ చేశారు. యువజన సంఘం అధ్యక్షుడు హరికృష్ణను వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. మున్సిపల్‌ కార్మికులు పట్టణాన్ని శుభ్రంగా ఉంచేందుకు నిరంతరం పని చేస్తారని, వారికి ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మహేశ్‌, సం దీప్‌, అనిల్‌, నవీన్‌, నరేందర్‌ పాల్గొన్నారు.
అల్పాహారం అందజేత
జడ్చర్ల టౌన్‌, మే 31 : జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు వచ్చిన రోగులకు కోర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో అల్పాహారం పం పిణీ చేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కోర్‌ ట్రస్టు ఆధ్వర్యంలో పలువురు యువకులు దవాఖాన దగ్గర అల్పాహారం పంపి ణీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రోగులు, వారి వెంట వచ్చి న వారికి అల్పాహారం అందజేశారు. కార్యక్రమంలో జ హంగీర్‌, ఖాజా, జాకీర్‌, దారాజ్‌, మునీర్‌, జమీర్‌, నేహాల్‌, షారూఖ్‌, జుబేర్‌, ఇంతియాజ్‌, ఆరీఫ్‌ పాల్గొన్నారు.
రెడ్‌క్రాస్‌ సేవలు ప్రశంసనీయం
భూత్పూర్‌, మే 31 : రెడ్‌క్రాస్‌ సొసైటీ సే వలు ప్రశంసనీయమని మున్సిపల్‌ చైర్మన్‌ సత్తూర్‌ బస్వరాజ్‌గౌడ్‌ అన్నారు. పురపాలిక సంఘంలో రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో మున్సిపల్‌ సిబ్బంది, ఆశ కార్యకర్తలకు ఎనర్జీడ్రింక్స్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ చై ర్మన్‌ మాట్లాడుతూ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఏర్పడి వందేండ్లు పూ ర్తయిన సందర్భంగా ఎనర్జీ డ్రింక్స్‌ పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఐ రజితారెడ్డి, కమిషనర్‌ నూరుల్‌నజీబ్‌, ఎస్సై భాస్కర్‌రెడ్డి, సీహెచ్‌వో రామయ్య, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ నటరాజ్‌ పాల్గొన్నారు.
సమిష్టి బాధ్యతతో కరోనా కట్టడి
ఊట్కూర్‌, మే 31 : ప్రభుత్వం తీసుకునే చర్యలతోపా టు ప్రజలు, సామాజిక బాధ్యతలు కలిగిన సేవా సంస్థలు అందించే సహకారంతోనే కరోనాను కట్టడి చేయగలమని డీఆర్‌డీవో కాళిందిని అన్నారు. మండలంలోని బిజ్వారం గ్రామాన్ని ఆమె సందర్శించారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలు గా ఉంటున్న ఇద్దరు బాలికలకు నిత్యావసర సరుకులను అందజేశారు. బాలికలకు భవిష్యతులో ఉన్నత చదువులు చదివేందుకు ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ పరంగా వసతులు కల్పిస్తామన్నారు. అనంతరం ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామ శివారులోని చాకలికుంట చెరువుకట్ట మరమ్మతు పనులను ఆమె పరిశీలించారు. కూలీలతో మాట్లాడి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనులను జాబ్‌కార్డు కలిగిన కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స ర్పంచ్‌ సావిత్రమ్మ, ఎంపీటీసీ హన్మమ్మ, ఉ పసర్పంచ్‌ నర్సింహులు, వెంకట్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు.
సరుకుల పంపిణీ
దన్వాడ, మే 31 : మండలంలో చైల్డ్‌లైన్‌ ఆధ్వర్యంలో కొంత కాలం కిందటా కరోనా బారిన పడి మరణించిన వారి కుటుంబాల వివరాలు తెలుసుకొని వారికి నిత్యావసర స రుకులు పంపిణీ చేశారు. ఎస్సై రాజేందర్‌ ఆ ధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి వారికి సరుకులు అందించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి ఇబ్బందులుంటే 1098కు ఫోన్‌ చేసి వివరాలు తెలియజేయాలని సంస్థ జిల్లా కో ఆర్డినేటర్‌ నరసింహ తెలిపారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, పోలీసు సిబ్బంది, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
అదేవిధంగా కంసాన్‌పల్లిలో బీజేపీ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. కిసాన్‌ మోర్చా రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్‌గౌడ్‌ సొంత ఖర్చుతో నిత్యావసర సరుకులు అందించారు. కార్యక్రమంలో నాగూరావ్‌నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, సర్పంచ్‌ ఆశప్ప, ఎంపీటీసీ సుంకు ఉమేశ్‌కూమార్‌ పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పేదలకు చేయూత

ట్రెండింగ్‌

Advertisement