భూత్పూర్, ఫిబ్రవరి 5 : ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. అదన పు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఆర్డీవో పద్మశ్రీ, డీఈవో ఉషారాణితో కలిసి శనివారం భూత్పూర్ మున్సిపాలిటీ, తాసిల్దార్, ఎంపీడీవో కార్యాలయాలను తనిఖీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. మున్సిపాలిటీలో రూ.99లక్షలు డిమాండ్ ఉండగా, రూ.40లక్షల కలెక్షన్ ఉందని, రెండునెలల్లో పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే అర్హులైన చిరువ్యాపారులందరికీ రుణాలను అందించాలని తెలిపారు. మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పథకాల అమలును వేగవంతం చేసేందుకు సీనియర్ అధికారులతో ప్రభుత్వ కార్యాలయాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే రేషన్ దుకాణాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలను తనిఖీ చేస్తారన్నారు. అధికారులు పనితీరును మార్చుకొని ప్రజలకు సులభంగా ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం మున్సిపాలిటీలో శానిటేషన్, ప్లాంటేషన్‌ను పరిశీలించారు. భవన నిర్మాణాలకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని, అనుమతి లేకుండా నిర్మిస్తే తొలగించాలని అ ధికారులను ఆదేశించారు. జాతీయరహదారి ైప్లెఓవర్ బ్రి డ్జికి వేయించిన పెయింటింగ్స్ బాగున్నాయని కలెక్టర్ అభినందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, కమిషనర్ నజీబ్ పాల్గొన్నారు.