e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 27, 2021
Home జిల్లాలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ఆరోపణలు తగదు

మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై ఆరోపణలు తగదు

మాజీ ఎంపీలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి హస్తం
చిల్లర రాజకీయాలు చేస్తే సహించం
విజన్‌ ఉన్న నేతను ఎదుర్కొనే ధైర్యం లేకే కుట్రలు
మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ నర్సింహులు
ఖైరతాబాద్‌, జూలై 29 : మహబూబ్‌నగర్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న మం త్రి శ్రీనివాస్‌గౌడ్‌పై అసత్య ప్రచారాలు మానుకోవాలని మహబూబ్‌నగర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ కేసీ నర్సింహులు సూచించారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏ ర్పాటు చేసిన అత్యవసర మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రిపై త ప్పుడు ఆరోపణలు చేస్తున్న బండేకర్‌ విశ్వనాథ్‌రావు, రాఘవేందర్‌ రాజు, మున్నూరు రవి.. మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి, బీజేపీ నేత డీకే అరుణ అనుచరులని ఆరోపించారు. రాఘవేంద్రరాజు రౌడీషీటర్‌ అని, డీకే అరుణ అనుంగు శిష్యుడని అన్నారు. వాట్సాప్‌ గ్రూపుల ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కుల, మతాల పేరుతో చిచ్చులు పెడుతున్నారన్నారు. అధికారులు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ చైర్మన్‌ను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు.

ఒక విజన్‌ ఉన్న నాయకుడు మంత్రి అని, ఆయనను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. భూత్పూర్‌ నుంచి మహబూబ్‌నగర్‌ వరకు కాంట్రాక్ట్‌ తీసుకున్న రోడ్డు పనులను మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి ఇంత వరకు పూర్తి చేయలేదని, దానిపై డీకే అరుణ సమాధానం చెప్పాలన్నారు. మున్నూరు రవి బ్రోకర్‌ అని, ఇప్పటికే ఆయన చేసిన తప్పుడు వ్యాఖ్యలపై పీఎస్‌లో ఫిర్యాదు చేశామన్నారు. అభివృద్ధి నిరోధకులను పట్టణ బహిష్కరణ చేస్తామన్నారు. ఎంపీగా పోటీ చేసిన డీకే ఆరుణను ప్రజలు తిరస్కరిస్తే మహబూబ్‌నగర్‌కు వచ్చి రాజకీయాలు చేస్తున్నారని విమర్శించా రు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గణేశ్‌, ఫ్లోర్‌ లీడర్లు రవికిషన్‌రెడ్డి, షబ్బీర్‌, కౌన్సిలర్లు జ్యోతి, పాషా మాటాడుతూ మతాల మధ్య చిచ్చుపెడుతూ మహబూబ్‌నగర్‌ను విచ్ఛిన్నం చేసే కుట్ర పన్నుతున్న విశ్వనాథ్‌, మున్నూరు రవి, రాఘవేందర్‌రాజులపై హెచ్‌ఆర్‌సీలో ఫిర్యాదు చేశామన్నారు. డీకే అరుణ, ఏపీ జితేందర్‌రెడ్డిలు చిల్లర రాజకీయాలు మానుకొని.. ప్రజాక్షేత్రంలోకి వచ్చి పోటీ చేయాలన్నారు. డబుల్‌ బెడ్రూం కోసం నాయకులు డబ్బులు అడిగారని తనతో చెప్పించి వీడియో తీశారని, వాస్తవానికి తనను ఎవరూ డ బ్బులు అడగలేదని, విశ్వనాథ్‌ రావు, రాఘవేందర్‌ రాజు, మున్నూరు రవి కావాలనే అలా చెప్పించారని ఆటో డ్రైవర్‌ గౌస్‌ తెలిపారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana