ముందంజలోఉందాం

- పండుగలా సభ్యత్వాలు నమోదు చేద్దాం
- ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్
- ఆమనగల్లులో సభ్యత్వ నమోదు ప్రారంభం
- స్వచ్ఛందగా సభ్యత్వం స్వీకరించిన ఆర్సీ తండాకు చెందిన దివ్యాంగుడు
కల్వకుర్తి, ఫిబ్రవరి 23: టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదులో ముందంజలో ఉండాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ పిలుపునిచ్చారు. కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మున్సిపాలిటీలోని 8, 9వ వార్డుల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ఎమ్మెల్యే మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యకర్తలకు టీఆర్ఎస్ సభ్యత్వాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సభ్యత్వాల నమోదులో ప్రతి కార్యకర్త క్రియాశీలంగా వ్యవహరించాలని సూచించారు. సభ్యత్వాలను లక్ష్యానికి మించి పూర్తి చేయాలని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ సత్యం ఆధ్వర్యంలో..
కల్వకుర్తి మున్సిపాలిటీలోని సుభాష్‌నగర్, గచ్చుబావి వద్ద టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా సభ్యత్వాలను పార్టీ శ్రేణులకు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కల్వకుర్తి మున్సిపాలిటీని టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో అగ్రగామిగా నిలుపుదామని పిలుపునిచ్చారు. ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ సభ్యత్వాలు నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు. కార్యక్రమంలో మాజీ చైర్మన్ శ్రీశైలం, సత్యనారాయణ, బంగారి పాల్గొన్నారు.
మరింత బలోపేతం చేద్దాం
కల్వకుర్తి రూరల్, ఫిబ్రవరి 23: టీఆర్ఎస్ సభ్యత్వాలను పెంచి పార్టీని మరింత బలోపేతం చేద్దామని టీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ కమిటీ అధ్యక్షుడు పుల్లారెడ్డి నాయకులతో కలిసి మంగళవారం సభ్యత్వాలు స్వీకరించారు. గ్రామంలో మొదటి సభ్యత్వాన్ని కల్వకుర్తి ఏఎంసీ చైర్మన్ బాలయ్యకు అందించారు. కార్యక్రమంలో నాయకులు మల్లేశ్, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, కృష్ణారెడ్డి, వార్డు సభ్యులు లింగం, గౌసుద్దీన్, గ్రామస్తులు ఉన్నారు.
తాడూరు మండలంలో..
తాడూరు, ఫిబ్రవరి 23: మండలంలోని వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును కార్యకర్తలు ముమ్మరంగా చేపడుతున్నారు. తాడూరులో మంగళవారం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పర్వతాలు ఇంటింటికీ వెళ్లి పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ క్రియాశీలక, సాధారణ సభ్యత్వాలను నమోదు చేస్తున్నారు. మండల కేంద్రంతోపాటు గుంతకోడూరు, యాదిరెడ్డిపల్లి, ఇంద్రకల్, పర్వతాయిపల్లి, చెర్లతిర్మలాపూర్, చెర్లఇటిక్యాల, తుమ్మలసూగుర్, అల్లాపూర్, గుట్టలపల్లి గ్రామాల్లో సభ్యత్వాల నమోదు కొనసాగుతున్నది.
సభ్యత్వాలతో బీమా సౌకర్యం
బిజినేపల్లి, ఫిబ్రవరి 23: సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి కార్యకర్తకూ బీమా ఉంటుందని ఎంపీపీ శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మండలంలోని పాలెం శివారులోని సుబ్బయ్యగూడెంలో వారు క్రియాశీల, సాధారణ సభ్యత్వాలను నమోదు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య, నాయకులు నాగరాజు, రామకృష్ణ, శివ, బాలస్వామి తదితరులు ఉన్నారు.
ముమ్మరంగా నమోదు
తెలకపల్లి, ఫిబ్రవరి 23: మండలంలో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ముమ్మరంగా జరుగుతుందని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు మాధవరెడ్డి అన్నారు. గట్టునెల్లికుదురులో నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆయనతోపాటు నాయకులు చంద్రారెడ్డి, ప్రతాప్‌రెడ్డి, బాబుగౌడ్ తదితరులు ఉన్నారు.
ప్రభుత్వం ఆదుకుంది
తిమ్మాజిపేట, ఫిబ్రవరి 23: అంగవైకల్యం ఉన్న తనకు రూ.3 వేల పింఛన్ ఇచ్చి ఆదుకున్న టీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటానంటూ తిమ్మాజిపేట మండలం ఆర్సీతండాకు చెందిన రమేశ్ స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని స్వీకరించాడు. పదేళ్ల కిందట ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయిన రమేశ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం నెల నెలా ఇస్తున్న రూ.3 వేల పింఛన్‌తోనే రమేశ్ కుటుంబం జీవనం సాగిస్తున్నది. ఈక్రమంలో మంగళవారం స్థానిక టీఆర్ఎస్ నాయకులను రమేశ్ ఇంటికి పిలిపించుకుని తనది, తన భార్య సభ్యత్వాన్ని నమోదు చేయించారు.
తాజావార్తలు
- గల్ఫ్‌లో భారతీయుల కోసం ప్రత్యేక విమానాలు
- రాష్ట్రంలో ముదురుతున్న ఎండలు
- 03-03-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు
- నమో నారసింహ
- డాలర్ మోసం
- కేసీఆర్ ఆధ్వర్యంలోనే పర్యాటకం రంగం అభివృద్ధి
- కళాకారులకు ఆర్థికంగా చేయూతనివ్వాలి
- విద్యుత్ వినియోగం..క్రమంగా అధికం!
- బీజేపీ ఇస్తామన్న ఉద్యోగాలు ఎక్కడ..?
- విద్యాసంస్థల 'వాణి'ని వినిపిస్తుంది..