బుధవారం 03 మార్చి 2021
Gadwal - Feb 23, 2021 , 00:37:06

నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ

నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ

  • నేడు పుట్టినింటికి పయనం 
  • రేపు మెట్టినింటికి అమ్మవారి రాక
  • మాఘశుద్ధ పౌర్ణమి నుంచి ఉత్సవాలు ప్రారంభం

గద్వాల టౌన్‌, ఫిబ్రవరి 22 : నడిగడ్డ ఇలవేల్పుగా.. కొలిచిన వారి కొంగు బంగారంగా.. కో రిన కోరికలు తీర్చే ఇష్టదైవంగా విరాజిల్లుతున్న జ మ్మిచేడు జములమ్మ బ్రహ్మోత్సవాలు మాఘశుద్ధ పౌర్ణమి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవా ల కంటే ముందు జోగుళాంబ గద్వాల జిల్లా జమ్మిచేడులో వెలిసిన జములమ్మ అమ్మవారిని భాజాభజంత్రీల మధ్య ఆలయ సిబ్బంది పుట్టినిైల్లెన దివిసీమ (గుర్రంగడ్డ)కు సంప్రదాయబద్ధంగా తీసుకెళ్లనున్నారు. ఈ మేరకు మంగళవారం అమ్మవా రు పుట్టినింటికి వెళ్లి అక్కడ అఖండ పూజలందుకొని బుధవారం 24న మెట్టినిల్లు (జమ్మిచేడు)కు తీసుకొస్తారు. మెట్టినింట అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలకు ఆలయ కమిటీ, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి ఏ డాది మాఘశుద్ధ పౌర్ణమి (ఈ నెల 27)న ప్రారం భం కానున్న బ్రహ్మోత్సవాల సందర్భంగా అమ్మవారిని కొలిచేందుకు మన రాష్ట్రం నుంచే కాకుం డా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. మంగళ, శుక్రవారాల్లో అమ్మవారి దర్శనానికి కాలు మోపేందు కు కూడా స్థలం లేనంతగా భక్తులు కిక్కిరిసిపోతా రు. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్‌ సతీశ్‌ తెలిపారు. 

మొదటి పూజ జములమ్మకే..

నడిగడ్డలో శుభకార్యమైనా, పండగైనా, జాతరైనా, ఉత్సవాలైనా మొదటి మొక్కు జములమ్మకే చెల్లుతుంది. ఆ తరువాతే మిగతా కార్యక్రమాలు ప్రారంభించడం నడిగడ్డ ప్రజల ఆనవాయితీ. 

జంటనాగులు, ముక్కిడమ్మకు పూజలు..

అమ్మవారి ఆలయం ఎదుట ఉన్న జంటనాగులను భక్తులు మొదటగా దర్శించుకుంటారు. అలా గే ముక్కిడమ్మగా పిలువబడే గ్రామదేవతను కొలుస్తారు. జములమ్మకు ముక్కిడమ్మ ఎల్లవేళలా కాప లా ఉంటుందని భక్తుల విశ్వాసం. ముక్కిడమ్మ వి గ్రహాన్ని చెక్కతో తయారుచేస్తారు. రెండేండ్లకోసా రి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఆనవాయితీ. అమ్మవారి కంటే ముందు నాగులు, ముక్కిడమ్మ ను దర్శించుకుంటే సకల పాపాలు తొలుగుతాయ ని భక్తుల నమ్మకం. అమ్మవారి ఆలయం ఎదుట ఉన్న పరశురాముడి(రాముడి అవతారం)ని కొలువడంతో భక్తుల పూజా కార్యక్రామలు ముగుస్తా యి. అమ్మవారికి పొంగలి నైవేద్యం, నిమ్మకాయ లు, పులమాలలు సమర్పిస్తారు. కోళ్లను, మేకపోతులను అమ్మకు నైవేద్యంగా అర్పించుకుంటారు. 

1983లో జరిగిన యదార్థ సంఘటన..

పెద్దల కథనం ప్రకారం.. జూరాల నిర్మాణం తరువాత జములమ్మ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని రిజర్వాయర్‌గా మార్చారు. దీంతో ఆలయం లోతట్టుకు చేరుకున్నది. ఆలయం అవతలి వైపు ఉన్న నీరు వెలుపలకి రావడం మొదలుపెట్టింది. దీంతో ఆలయం లోతట్టులో ఉండడం శ్రేయస్కరం కాదని భావించిన కొందరు.. సురక్షితమైన ప్రాంతంలో నిర్మించాలని తలంచారు. మూలవిరాట్‌ను తొలిగించేందుకు  పనులు ప్రారంభించగా, దాదాపు 10 అడుగులు లోతు తవ్వినా.. విగ్రహం బయటకురాలేదు. దీంతో అసహనం కోల్పోయిన వారు విగ్రహాన్ని అటూఇటూ ఊపడం మొదలుపెట్టారు. ఇంతలో వారి కండ్లు మూసుకుపోయి చీకటిమయంగా మారింది. గ్రామపెద్దలు అమ్మవారిని అక్కడి నుంచి తరలించడం ఎవరి తరం కాదని యథావిధిగా ఉంచాలని సూచించారు. అమ్మను వేడుకోగా, వారికి కండ్లు తిరిగివచ్చాయి. వెంటనే అప్పటి అధికారులు ఆలయంలోకి నీరు చేరకుండా ఆనకట్ట నిర్మించారు. ఇదంతా 1983లో జరిగిందని గ్రామపెద్దలు, అ క్కడ పనిచేసిన వారు చెబుతున్నారు. 

VIDEOS

logo