మంగళవారం 09 మార్చి 2021
Gadwal - Feb 22, 2021 , 01:04:47

మాతృభాషను మరువొద్దు

మాతృభాషను మరువొద్దు

  • జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత
  • గద్వాల సంస్థాన కవి కాశీపతికి ఘన నివాళి
  • కవులకు ఘన సన్మానం

గద్వాలటౌన్‌, ఫిబ్రవరి 21: మనం ఎక్కడున్నా.. ఎంత ఎదిగినా మాతృభాషను మరువొద్దని జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గద్వాల కోటలో ఉన్న భూలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో ఆదివారం సీనియర్‌ సిటిజన్‌ ఫోరం, గద్వాల సాహితీ ఆధ్వర్యంలో సంయుక్తంగా 128వ మాతృభాషా దినోత్సవం, గద్వాల ఆస్థాన కవి దివంగత కాశీపతి జయంత్యుత్సవాలను నిర్వహించారు. ఉత్సవాలకు జెడ్పీ చైర్‌పర్సన్‌తోపాటు గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా కాశీపతి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మట్లాడుతూ మాతృభాష అమ్మలాంటిదన్నారు. మాతృభాషాభివృద్ధికి ప్రతిఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ గద్వాల సంస్థాన కవి కాశీపతిని స్మరించుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నామన్నారు. గద్వాల సంస్థానంలో ఎందరో కవులు కీర్తించబడ్డారని వారిలో కాశీపతి కవి ఎంతో గొప్పవారని కొనియాడారు. అంతకుముందు కవి సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించారు. సమ్మేళనంలో వివిధ ప్రాంతాలకు చెందిన కవులు కవితలు, పాటలు, మాటలు, పద్యాలతో అలరించారు. అనంతరం గ్రంథాలయ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డిని, కవులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సిటిజన్‌ ఫోరం అధ్యక్షుడు మోహన్‌రావు, గద్వాల సాహితీ సభ్యులు హరినాగభూషణం, రాజశేఖర్‌, భానుప్రకాశ్‌, కవులు రామ్మోహన్‌రావు, చెన్నకేశవచారి తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo