శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Gadwal - Feb 19, 2021 , 02:47:03

కొనసాగుతున్న అంతర్రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ పోటీలు

కొనసాగుతున్న అంతర్రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ పోటీలు

అయిజ, ఫిబ్రవరి 18 : ధన్వంతరి వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉత్తనూర్‌ గ్రామంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడియంలో అంతర్రాష్ట్ర బాస్కెట్‌బాల్‌ టోర్నమెంట్‌ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. గురువారం తెలంగాణ, ఏపీ రాష్ర్టాలకు చెందిన పలు జట్లు పోటీలో పాల్గొన్నాయి. బుధవారం రాత్రి సౌత్‌ సెంట్రల్‌ రైల్వే, కంబైన్డ్‌ తెలంగాణ మహిళల జట్లు తలపడగా, 64-21 స్కోరుతో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే జట్టు గెలుపొందింది. సౌత్‌ సెంట్రల్‌ రైల్వే (పురుషులు), చిత్తూరు జట్లు తలపడగా 66-30 స్కోరుతో సౌత్‌ సెంట్రల్‌ రైల్వే గెలుపొందింది. వైఎంసీఏ సికింద్రాబాద్‌, కర్నూల్‌ జట్లు తలపడగా 69-51 స్కోర్‌తో వైఎంసీఏ గెలుపొందింది. ఇన్‌కం ట్యాక్స్‌ , మహబూబ్‌నగర్‌ జట్లు తలపడగా 79-38 స్కోర్‌తో ఇన్‌కం ట్యాక్స్‌ జట్టు గెలుపొందింది. గురువారం ఇన్‌కం ట్యాక్స్‌, ఏయిర్‌ బోన్‌ జట్లు తలపడగా, 73-59 స్కోర్‌తో ఏయిర్‌ బోన్‌ జట్టు గెలుపొందింది. మహిళల విభాగంలో అనంతపూర్‌, విజయవాడ జట్లు పోటీ పడగా 46-22 స్కోరుతో అనంతపూర్‌ జట్టు విజేతగా నిలిచిందని టీబీఏ అసోసియేట్‌ కార్యదర్శి నయీముద్దీన్‌ తెలిపారు. 


VIDEOS

logo