మంగళవారం 09 మార్చి 2021
Gadwal - Feb 19, 2021 , 02:47:02

పథకాల అమలు బాధ్యత అధికారులదే..

పథకాల అమలు బాధ్యత అధికారులదే..

అలంపూర్‌, ఫిబ్రవరి 18 : గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలు బాధ్యత అధికారులదేనని జెడ్పీసీఈవో ముషాయిదాబేగం అన్నారు.  మండలంలోని సింగవరం1,2 గ్రామాల్లో ఎంపీడీవో సుగుణ కుమార్‌తో కలిసి ఆమె గురువారం పర్యటించారు. గ్రామ పంచాయతీల్లో రికార్డులను పరిశీలించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలను పరిశీలించారు. ఎండిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. పారిశుధ్యం, నర్సరీల పెంపకం, రైతు కల్లాల నిర్మాణాలు, మురుగు కాల్వల నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి సిబ్బంది, పంచాయతీ కార్యదర్శుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి బాధ్యత పంచాయతీ కార్యదర్శులపైనే ఉందని, ప్రజాప్రతినిధులను ప్రోత్సహించి మంజూరైన అభివృద్ధి పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. డంపింగ్‌ యార్డులు, శ్మశాన వాటిక , సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్మాణాల్లో పెండింగ్‌లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీఈవో చంద్రకళ, ఏపీవో శరత్‌, ఈసీ రామకృష్ణ పాల్గొన్నారు.


VIDEOS

logo