గురువారం 25 ఫిబ్రవరి 2021
Gadwal - Feb 15, 2021 , 00:54:48

అంబరాన్నంటిన బ్రహ్మోత్సవాలు

అంబరాన్నంటిన బ్రహ్మోత్సవాలు

  • కొనసాగుతున్న జోగుళాంబ ఉత్సవాలు  
  • రేపు అమ్మ వారి నిజరూప దర్శనం, కల్యాణం

అలంపూర్‌, ఫిబ్రవరి 14 : ఐదో శక్తి పీఠం గా విరాజిల్లుతున్న జోగుళాంబ అమ్మవా రి బ్రహ్మోత్సవాలు అంబురాన్నంటుతున్నాయి. అలంపూర్‌ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాల్లో నాలుగు రోజులుగా వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. నిత్యం అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. చండీహోమాలు, పవమాన సూక్త పారాయణ హోమాలు, ఆవాహిత దేవతా హోమా లు, మండపారాధన, బలిహరణం, నీరాజన మంత్ర పుష్పాలు మొదలగు పూజా కార్యక్రమా లు చేపడుతున్నారు. ఉత్సవాలను తిలకించేందు కు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఆదివారం ములుగు ఎమ్మెల్యే సీతక్క, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి ఆలయాలను దర్శించుకున్నారు. వారికి ఆలయాధికారులు ఘన స్వాగ తం పలికారు. స్వామి, అమ్మ వారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో చివరి రో జైన 16వ తేదీన యాగశాలలో నిత్యహోమాలు, మహాపూర్ణాహుతి, కలశ ఉద్వాసన, అమ్మ వారి  ని జరూప దర్శన భాగ్యం ఉంటుంది. సాయం త్రం 4 గంటలకు అమ్మ వారి శాంతి కల్యాణం నిర్వహిస్తారు. అభిషేకం నిర్వహించేందుకు ఏ ర్పాటు చేయనున్న సహస్ర ఘటాభిషేకంలో పా ల్గొనేందుకు భక్తులు రూ.200 చెల్లించి రశీదు పొందాలని ఈవో ప్రేమ్‌కుమార్‌రావు తెలిపారు. నిజరూపదర్శనానికి అన్ని ఏర్పాట్లు చేశారు. నిజరూప దర్శనానికి పలువురు ప్రముఖులు రానున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం, ఆలయ పాలక మండలి చైర్మన్‌ రవి ప్రకాశ్‌గౌడ్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ సతీమణి శోభ, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కవి త, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి రానున్నట్లు పేర్కొన్నారు.

VIDEOS

logo