సోమవారం 01 మార్చి 2021
Gadwal - Feb 13, 2021 , 02:07:26

బ్రహ్మోత్సవం ఆరంభం

బ్రహ్మోత్సవం ఆరంభం

  • వైభవంగా అలంపూర్‌లోని జోగుళాంబ ఉత్సవాలు
  • ప్రత్యేక పూజల నిర్వహణ
  • ధ్వజారోహణతో వేడుకలకు శ్రీకారం   
  • హాజరైన జోగుళాంబ గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే అబ్రహం

అలంపూర్‌, ఫిబ్రవరి 12 : అలంపూర్‌ జోగుళాంబ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. శార్వరి నామ సంవత్సరం మాఘ శుద్ధ పాఢ్యమి న శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మంగళవాయిద్యాల నడుమ పండ్లు, పూ లు, నూతన వస్ర్తాలతో అమ్మవారి ఆ లయం నుంచి అర్చకులు, ఈవో ప్రేమ్‌కుమార్‌రావు, పాలక మండలి చైర్మన్‌, సభ్యులు బయలుదేరి స్వామి వారి గర్భాలయం చేరుకున్నారు. స్వామి వారికి వస్త్ర అలంకరణ చేసిన అనంతరం త్రిశూల రాజంతో పల్లకీలో అమ్మ వారి ఆలయం చేరుకున్నారు. అక్కడ అమ్మ వారికి వస్ర్తాలంకరణ చేసి.. త్రిశూల స్వామి వారిని అమ్మ వారి చెంతకు చేర్చారు. అనంతరం పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఉదయం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆనతి స్వీకరణ, అమ్మవారి ఆలయంలో గోమాత, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మహాకలశ స్థాపన, ఆవాహిత దేవతా హోమం, బలిహరణం, నీరాజన మంత్ర పు ష్పం మొదలగు కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

ఘనంగా ధ్వజారోహణం

వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఘ నంగా ధ్వజారోహణం నిర్వహించారు. కార్యక్రమానికి జోగుళాంబ గద్వాల జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహం పాల్గొన్నారు. మొదట ఉభయ ఆలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అ మ్మ వారి ఆలయం ఎదుట    ధ్వజస్తంభానికి అమ్మ వారి వాహనమైన సింహం గుర్తు   జెండాను  ఎగురవేశారు. అనంతరం సరిత, అబ్రహం మీడియాతో మాట్లాడారు. అమ్మవారి నిజరూప దర్శనం ఏడాదికోసారి మాత్రమే ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, అలంపూర్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ, టీఆర్‌ఎస్‌ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

VIDEOS

logo