గురువారం 25 ఫిబ్రవరి 2021
Gadwal - Feb 11, 2021 , 00:14:23

రుణాలను వందశాతం వసూలు చేయాలి

రుణాలను వందశాతం వసూలు చేయాలి

  • డీఆర్డీవో ఉమాదేవి

అయిజ, ఫిబ్రవరి 10 : మండలంలోని మహిళా సంఘాలు బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను వందశాతం వసూలు చేయాలని డీఆర్డీవో ఉమాదేవి వీవోఏలను ఆదేశించారు. బుధవారం పట్టణంలోని ఐకేపీ భవనంలో మహిళా సంఘాలు, ఐకేపీ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ 2020-21 సంవత్సరంలో కొత్త సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. బ్యాంకు లింకేజీ, ఆదాయం వచ్చే కార్యక్రమాలు చేసేలా చూడాలన్నారు. దూదితో దీపారాధన ఒత్తులు తయారు చేస్తే మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తామని మహిళా సంఘాలకు సూచించారు. బ్యాంకు రుణాలు బకాయిలు ఉన్న వేణిసోంపురం గ్రామాన్ని వందశాతం రికవరీ చేసినందుకు ఏపీఎం కోటేశ్వరి, సీసీలను ఆమె అభినందించారు. కార్యక్రమంలో అదనపు డీఆర్డీవో సరోజ, ఏపీఎం కోటేశ్వరి, సీసీలు, వీవోఏలు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. 

హరితహారంలో మొక్కలు నాటాలి

ఇటిక్యాల, ఫిబ్రవరి 10 : హరితహారంలో భాగంగా నాటిన మొక్కలు ఎండిపోతే వాటి స్థానంలో కొత్త మొక్కలు నాటాలని డీఆర్‌డీవో ఉమాదేవి సూచించారు. ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు  బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలను త్వరగా పూర్తి చేయాలని, చెత్త సేకరణలో భాగంగా తడి, పొడిచెత్త వేరు చేసే ప్రక్రియను కొనసాగించాలన్నారు. రైతు కల్లాల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. అంతకు ముందు ఆమె తిమ్మాపూర్‌ నర్సరీలో పెంచుతున్న మొక్కలను, బీచుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఫీడర్‌ ఛానల్‌ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రామమహేశ్వర్‌రెడ్డి, ఏపీవో రాజు ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

logo