ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Feb 10, 2021 , 02:20:26

విద్యతోపాటు క్రీడలకూ ప్రాధాన్యం

విద్యతోపాటు క్రీడలకూ ప్రాధాన్యం

గద్వాల, ఫిబ్రవరి9: తెలంగాణ ప్రభుత్వం విద్యతో పాటు రాష్ట్రంలో క్రీడలకూ ప్రాధాన్యత ఇస్తున్నదని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. కేసీఆర్‌ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ‘కేసీఆర్‌ కప్‌ 2021’ జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీలను గద్వాల ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించారు. ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు పురపాలక చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ను తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు వెంగళ్‌రెడ్డి సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గద్వాల ఇండోర్‌ స్టేడియాన్ని మరింత అభివృద్ధి చేయడానికి రూ.50లక్షల నిధులు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌ పర్సన్‌ రామేశ్వరమ్మ, గద్వాల జిల్లాపరిషత్‌ వైస్‌ చైర్‌ పర్సన్‌ సరోజమ్మ, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ సంజీవులు, జెడ్పీటీసీ రాజశేఖర్‌, పీఈటీలు ఆనంద్‌, హైమావతి, జితేందర్‌, బీసన్న, శ్రీనివాసులు, స్రవంతి, నాయకులు ప్రభాకర్‌గౌడ్‌, రమేశ్‌నాయుడు, కృష్ణ, తిమ్మన్న పాల్గొన్నారు.


VIDEOS

logo