బుధవారం 24 ఫిబ్రవరి 2021
Gadwal - Feb 06, 2021 , 00:24:56

అతివేగం ప్రమాదకరం

అతివేగం ప్రమాదకరం

  • డీటీవో పురుషోత్తం రెడ్డి 

గద్వాల అర్బన్‌, ఫిబ్రవరి 5 : అతివేగంతో వాహనాన్ని  నడపడం ప్రమాదకరమని జిల్లా రవాణాశాఖ అధికారి పురుషోత్తంరెడ్డి అన్నారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు పురస్కరించుకొని శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 200 మంది డ్రైవర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులు విధిగా హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ పెట్టుకొని ఏకాగ్రతతో వాహనాన్ని నడపాలని సూచించారు. వాహనాన్ని నడిపే సమయంలో మీ కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకొని వాహనం నడపాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులను  హెచ్చరించారు. కార్యక్రమంలో ఎంవీఐ చక్రవర్తి గౌడ్‌, డాక్టర్లు మోహన్‌రావు, సయ్యద్‌ రఫీయొద్దీన్‌, ఎంవీలు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.


VIDEOS

logo