ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు పురస్కారాలు

ఇటిక్యాల, ఫిబ్రవరి 2 : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతూ ప్రతిభ కనబర్చిన పేద విద్యార్థులకు క్యూబ్రూట్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ హైవే లిమిటెడ్ వారు మంగళవారం నగదు పురస్కారాలను అందజేశారని ఎంఈవో రాజు తెలిపారు. మండలంలోని జాతీయ రహదారి పాఠశాలలైన కొండేర్, ఎర్రవల్లి చౌరస్తా, బీచుపల్లి గురుకుల పాఠశాల, కోదండాపూర్ పాఠశాలల విద్యార్థులకు నగదు పురస్కారాలు అందజేయడంతోపాటుగా ఆయా పాఠశాలలో విద్యార్థులకు ఉపయోగపడే పలు సామగ్రిని అందజేశారని తెలిపారు. కొండేర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గతేడాది పదో తరగతి పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మనీషా, రేణుకలకు రూ.10 వేల చొప్పున నగుదు పురస్కారం అందజేశారన్నారు. అలాగే పాఠశాలలో చదివే విద్యార్థుల సౌకర్యార్థం ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలకు ఒక్కొక్కటి చొప్పున కంప్యూటర్లను అందజేశారని తెలిపారు. అలాగే కోదండాపూర్ పాఠశాలలో విద్యార్థులకు శుద్ధమైన తాగునీటినందించేందుకు ఆర్వోప్లాంట్ , ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రవళిక, సోనూబేగంలకు రూ.10వేల చొప్పున నగదు పురస్కారం, ఎర్రవల్లి పదోపటాలం పాఠశాలకు 50 డెస్క్ బెంచీలు, విద్యార్థులు అభిషేక్నాయక్, నవీన్లకు రూ.10వేల చొప్పున నగదు పురస్కారం, అందజేశారన్నారు. బీచుపల్లి బాలుర గురుకుల పాఠశాలకు ఇన్వర్టర్ బ్యాటరీ, మైక్ సెట్, ఎల్ఈడీ లైటింగ్ సౌకర్యం అందజేసినట్లు ఎంఈవో తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేర్ మోడల్ స్కూల్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో వీటిని వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు విద్యార్థులకు, పాఠశాలలకు అందజేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
- సెల్ఫీ విత్ హెల్మెట్ డ్రైవ్ షురూ..
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..
- తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు
- రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ
- సందేహాలు తీర్చేందుకే యూఎస్ఏ సెంటర్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
- 06-03-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
- రాష్ట్రంలో మూడురోజులు పొడి వాతావరణం.. పెరగనున్న ఎండలు