చుక్కల మందుకు చక్కని స్పందన

- పిల్లలకు మంచి భవిష్యత్ అందించాలి
- పోలియో చుక్కలు వేసిన కలెక్టర్ శృతి ఓఝా, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల, అబ్రహం
గద్వాలటౌన్, జనవరి 31: పోలియో చుక్కలు వేయించి పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని జెడ్పీ చైర్పర్సన్ సరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్‌వో కార్యాలయం లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ శృతిఓఝా, ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ శృతి ఓఝా మాట్లాడుతూ తమ పిల్లలకు చుక్కల మందు వేయించడం తల్లిదండ్రుల బాధ్యతన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, కౌన్సిలర్ శ్వేత, ఇన్చార్జి డీఎంహెచ్‌వో చందూనాయక్, వరలక్ష్మి, విష్ణు, రమేశ్, మదుసూధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అలంపూర్‌లో..
అలంపూర్, జనవరి 31: పట్టణంలోని హరిజనవాడ ప్రభు త్వ పాఠశాలలో మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ చుక్కల మందు కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, శ్మామలాదేవి, హేమలత, మాధవి, రూపప్రియ, ప్రమీల, వరలక్ష్మి, నాగేశ్వరమ్మ పాల్గొన్నారు. క్యాతూరు ఆరోగ్య కేంద్రం పరిధిలో సిబ్బంది ఆయా గ్రామాల్లో చిన్నారులకు చుక్కల మందు వేశారు.
ఉండవెల్లిలో..
ఉండవెల్లి జనవరి 31 : మండలంలోని తక్కశిల, ప్రాగటూర్, మారమునగాల, శేరుపల్లి, ఉండవెల్లి, బొంకూరు, తదితర గ్రామాల్లో పల్స్‌పోలియో కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.
ధరూరులో..
ధరూరు: మండల కేంద్రంలోని సంత బజార్లో డాక్టర్ స్రవంతి ఆధ్వర్యంలో పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో స్త్రీ శిశు సంక్షేమశాఖ చైర్మన్ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ నజుమున్నిసాబేగం, సర్పంచ్ పద్మమ్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
కేటీదొడ్డిలో..
కేటీదొడ్డి : మండల కేంద్రంలో ఎంపీపీ మనోరమ ఆదివారం పోలియో చుక్కలు వేసి ప్రారంభించారు. మండల కేంద్రంతోపాటు అన్ని గ్రామాల్లో సర్పంచులు, ఎంపీటీసీలు పోలియో చుక్కలు వేశారు.
వడ్డేపల్లిలో..
వడ్డేపల్లి, జనవరి 31 : మండల కేంద్రంలోని శాంతినగర్‌లో ఆదివారం మున్సిపల్ చైర్పర్సన్ కరుణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అబ్రహం పల్స్‌పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ మాణిక్యం రవి, నాయకులు వడ్డేపల్లి సూరి, డీలర్ శ్రీను, నతానియోల్, తోటరవి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
అయిజలో..
అయిజ, జనవరి 31: చిన్నారుల బంగారు భవిష్యత్‌కు పోలియో చుక్కలు వేయించాలని పీహెచ్సీ డాక్టర్ రామలింగారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొత్త బస్టాండ్, బుడగ జంగాల కాలనీ, ఎస్సీ కాలనీల్లో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిన్న దేవన్న, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
పదో బెటాలియన్‌లో..
ఎర్రవల్లి చౌరస్తా, జనవరి 31: ఎర్రవల్లి చౌరస్తాలోని పదో బెటాలియన్‌లో ఆదివారం కమాండెంట్ జమీల్‌పాషా ఆధ్వర్యంలో పల్స్‌పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని చిన్నారుల తల్లిదండ్రులను కోరారు. అదేవిధంగా ఎర్రవల్లిచౌరస్తాలో జెడ్పీ చైర్పర్సన్ సరిత చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. చిన్నారుల భవిష్యత్‌కు పోలియో చుక్కలు వేయించాలన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ ఆదినారాయణ, అసిస్టెంట్ సంక్షేమాధికారి రాజేశ్, డాక్టర్ రవిశంకర్, ధనుంజయ్, అశోక్, ఫాతిమాబీ, ఈశ్వర్‌రెడ్డి, పరిమళ, సిబ్బంది పాల్గ్గొన్నారు.