రక్తదాన శిబిరానికి విశేష స్పందన

- ఉత్తనూరులో 1,560 మంది రక్తదానం
- హాజరైన ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
అయిజ, జనవరి 31 : అన్ని దా నాల కన్న.. రక్తదానం మిన్న అని ఎ మ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని ఉత్తనూర్ గ్రా మంలో ధన్వంతరి వేంకటేశ్వరస్వా మి దేవస్థాన కమిటీ, ఇండియన్ రెడ్‌క్రాస్ సౌజన్యంతో మాజీ ఎంపీపీ తి రుమల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి న మెగా ఉచిత వైద్య, రక్తదాన శిబిరానికి ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ముఖ్య అతిథులు గా హాజరయ్యారు. ఈ సందర్భంగా అబ్రహం మాట్లాడుతూ ఉమ్మడి జి ల్లాలోని ఓ మారుమూల గ్రామంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు, మందులు అందించడం అభినందనీయమన్నారు. మండల స్థాయిలో అ త్యధికంగా రక్తదానం చేయించడం గ ర్వకారణమన్నారు. ఎమ్మెల్యే బండ్ల మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రోగు లు కార్పొరేట్ దవాఖానలకు వెళ్లి చి కిత్స చేయించుకోలేని రోగులకు ఉచిత వైద్య శిబిరం గొప్ప వరమని అన్నారు. హైదరాబాద్‌లోని కేర్ దవాఖాన వైద్యులు పరీక్షలు నిర్వహించారని చెప్పారు. గ్రామీణ ప్రాం తంలో 1,560 మంది రక్తదానం చే యడం రాష్ట్ర చరిత్రలో రికార్డు న మోదు చేసిందన్నారు. అంతకుముం దు గద్వాల ఎమ్మెల్యే స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఉదయం వైద్య, రక్తదాన శిబిరాన్ని అదనపు కలెక్టర్ శ్రీహర్ష ప్రారంభించి రక్తదానం చేశా రు. ఎస్పీ రంజన్త్రన్‌కుమార్ రక్తదాతలను ప్రోత్సహించారు. 9 వేల మందికి వైద్య పరీక్షలు చేశారు. వై ద్య, రక్తదాన శిబిరంలో సేవలందించిన వలంటీర్లకు మెమోంటోలు అం దజేశారు. కార్యక్రమంలో ఆర్డీవో రా ములు, సీఐ వెంకటేశ్వర్లు, పారిశ్రామిక వేత్త శ్రీనాథ్‌రెడ్డి, టీఆర్ఎస్ యువజన నాయకుడు అజయ్, ఎం పీపీలు నాగేశ్వర్‌రెడ్డి, విజయ్, ము న్సిపల్ వైస్‌చైర్మన్ నర్సింహులు, మా జీ ఎంపీపీ సుందర్రాజు, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు రాముడు, రెడ్‌క్రాస్ చైర్మన్లు నటరాజ్, రమేశ్, సర్పంచులు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- లీటర్ పెట్రోల్ ధర రూ.100.. ఇక కామనే.. మోత మోగుడు ఖాయం
- మ్యాన్‌హోల్‌లో చిక్కుకుని నలుగురు మృతి
- ఉత్తమ రైతు మల్లికార్జున్‌రెడ్డికి ఎమ్మెల్సీ కవిత సన్మానం
- దేశ చట్టాలకు లోబడే సోషల్ మీడియా: అమిత్‌షా
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ