ముక్కలవుతున్న బతుకులు!

- గద్వాలలో జోరుగా పత్తాలాట
- ప్రత్యేక గదులు, పంటపొలాలే అడ్డాలు
- పోలీసుల దాడుల్లో పట్టుబడుతున్న వైనం
గద్వాల న్యూటౌన్, జనవరి 29 : గద్వాల పట్టణం జూదానికి కేంద్ర బిందువుగా మారింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు పాల్గొంటుండడంతో వేలాది రూపాయాల్లో ఈ దందా కొనసాగుతోంది. అయితే పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పేకాట స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నారు. ఇక దాడుల్లో పేకాట రాయుళ్లను పట్టుకోవడమే కాకుండా రూ. వేలల్లో నగదు, సెల్ఫోన్లు, స్వాధీనం చేసుకుంటున్నారు. అయినా ఆట మాత్రం మానడం లేదు.
రహస్యంగా పేకాట
జిల్లా కేంద్రంతోపాటు శివారు ప్రాంతాలను పేకాట రాయుళ్ల అడ్డాలుగా ఏర్పాటు చేసుకొని రహస్యంగా పేకాట ఆడుతున్నారు. ముఖ్యంగా పిల్లిగుండ్ల, లింగంబావి, గంజిపేట, చింతలపేట, కృష్ణారెడ్డి బంగ్లా కాలనీలతో పాటు శివారు ప్రాంతాల్లో పేకాట జోరుగా సాగుతోంది. పేకాట కోసం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మరి పేకాట ఆడుతున్నట్లు సమాచారం. పట్టణం, వ్యవసాయ పొలాలు, నివాస గృహాలను తమ అడ్డాలుగా మార్చుకొని వ్యాపారాన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా నిర్వహిస్తున్నారు. స్థావరాలపై పోలీసులు దాడులు చేసి పేకాట రాయుళ్లను అరెస్టు చేసినా.. వారు మాత్రం తమ పద్ధతి మార్చుకోవడం లేదు. పోలీసు యంత్రాంగం పేకాట రాయుళ్లను మాత్రమే కాకుండా పేకాట నిర్వాహకులపై కూడా చర్యలు చేపట్టి బీద, మధ్యతరగతి కుటుంబాలను పేకాట ఊబిలో నుంచి బయట పడేలా చేయాలని పలువురు కోరుతున్నారు.
వడ్డీలకిచ్చి మరీ..
పేకాట డబ్బులు పోగొట్టుకున్న భాదితులకు అప్పటికప్పుడే అప్పు రూపంలో ఇచ్చేందుకు కూర్చొన్న చోటనే వడ్డీ వ్యాపారులు సిద్ధంగా ఉంటారు. కొన్ని చొట్ల ఆభరణాలు, వాహనాలను సైతం తాకట్టు పెట్టి కొందరు కుటుంబాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. నూటికి రూ.5 నుంచి రూ.10కి వడ్డీ రూపంలో తీసుకున్న డబ్బులను ఇంటికి తీసుకెళ్లకుండా అక్కడే ఆడాలని నిబంధనలను పెడుతున్నట్లు సమాచారం. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు పేకాటకు బానిపై డబ్బులు పోగొట్టుకుంటున్న ఆవేదనలో మత్తులో మద్యానికి అలవాటు పడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.
పట్టుబడిన సంఘటనలు
- గతేడాది ఆక్ట్టోబర్ 16న పట్టణంలోని పాత కూరగాయల మార్కెట్ ప్రాంతంలోని ఓ వైన్ షాపు పరిసరాల్లో పేకాట ఆడుతున్న అరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.750 స్వాధీనం చేసుకున్నారు.
- గతేడాది నవంబర్ 21న పట్టణ శివారులోని పిల్లిగుండ్ల కాలనీ పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.2,668 నగదను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
- ఈనెల 16న పట్టణంలోని లింగంబావి కాలనీలో పేకాట ఆడుతున్న 8 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.68,680 నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేశారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
పేకాట స్థావరాలపై తరుచూ దాడులు చేస్తున్నాం. జిల్లా కేంద్రంలో నిరంతరం ఈ ఆటపై నిఘాను పెడుతూనే ఉన్నాం. ఎవరైనా క్రికెట్ బెట్టింగ్, పేకాట ఆడుతుంటే పోలీసులకు సమాచారం అందించాలి. పేకాటలో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పలుసార్లు పట్టుబడితే రిమాండ్‌కు తరలిస్తాం.
- హరిప్రసాద్‌రెడ్డి, ఎస్సై, గద్వాల టౌన్
తాజావార్తలు
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు
- హాట్ టాపిక్‌గా వైష్ణవ్‌తేజ్ 3 సినిమాల రెమ్యునరేషన్
- బస్సులను అపడం లేదు.. కానీ నెగటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి
- రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. అడ్డుకున్న రైల్వే పోలీసులు ..వీడియో
- అతివేగం ఖరీదు : బెంజ్ కారు నడుపుతూ వ్యక్తిని బలిగొన్న టీనేజర్!
- నీరవ్ కోసం ఆర్థర్ జైలులో ఏర్పాట్లు
- భారత్‌తో చర్చలకు సిద్ధం : ఇమ్రాన్ ఖాన్
- సీటెట్ ఫలితాల విడుదల
- అందాల యాంకరమ్మకు అంతా ఫిదా..!