శుక్రవారం 05 మార్చి 2021
Gadwal - Jan 29, 2021 , 01:58:22

జములమ్మ ఆలయంలో పల్లకీసేవ

జములమ్మ ఆలయంలో పల్లకీసేవ

గద్వాల రూరల్‌, జనవరి28 : నడిగడ్డ ఇలవేల్పు జములమ్మ ఆలయంలో గురువారం పౌర్ణమి సందర్భంగా పల్లకీసేవ నిర్వహించారు. అంతకు ముందు ఆలయ చైర్మన్‌ సతీశ్‌ కుమార్‌ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకీసేవలో పాల్గొన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ నాగిరెడ్డి, పాలక మండలి సభ్యులు జానకీరాములు, రాము, సుందరరాజు, రాజారెడ్డి, శివారెడ్డి, ఆలయ సిబ్బంది మురళీధర్‌రెడ్డి, రవిప్రకాశ్‌, సంజీవరెడ్డి, సురేశ్‌, మదిలేట్టి, నాగరాజు  పాల్గొన్నారు.

ఆలయంలో చండీ హోమం

అలంపూర్‌ ,జనవరి 28 : జోగుళాంబ ఆలయంలోని యాగశాలలో పౌర్ణమి పురస్కరించుకొని గురువారం చండీహోమం నిర్వహించారు. సడలించిన నిబంధనల మేరకు భక్తులకు హోమంలో పాల్గొనే అవకాశం కల్పించారు. గురువారం 37మంది భక్తులు హోమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి చైర్మన్‌ రవి ప్రకాశ్‌గౌడ్‌, ధర్మకర్తలు వెంకట్రామయ్యశెట్టి, ఆలయ ఈవో ప్రేమ్‌కుమార్‌ రావు, సిబ్బంది పాల్గొన్నారు.

లోక కల్యాణం కోసం హోమం

మానవపాడు, జనవరి 28:  మండలంలోని బోరవెల్లి గ్రామంలో చెన్నకేశవ స్వామి ఉత్సవాలు ప్రారంభమాయ్యాయి. లోక కల్యాణం కోసం ఆలయ ప్రాంగణంలో చండీ హోమం నిర్వహించారు. గురువారం రాత్రి చెన్నకేశవుడి రథోత్సవానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. శుక్రవారం పారువేట , శనివారం నాగవల్లి  నిర్వహించనున్నట్లు  నిర్వాహకులు తెలిపారు.  

VIDEOS

logo