ఆదివారం 07 మార్చి 2021
Gadwal - Jan 29, 2021 , 01:58:28

మరింత మెరుగైన పాలన అందించాలి

మరింత మెరుగైన పాలన అందించాలి

  • ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల, జనవరి 28: మున్సిపల్‌ ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌కు సూచించారు. చైర్మన్‌గా కేశవ్‌ ఎన్నికై ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్‌ కట్‌ చేయగా ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లను సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చైర్మన్‌తోపాటు కౌన్సిలర్లు వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతో భవిష్యత్‌లో గద్వాల మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. అనంతరం మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో మున్సిపాలిటీలోని సమస్యలు పరిష్కరించి మున్సిపల్‌ అభివృద్ధి కోసం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మహిళా కౌన్సిలర్లు ఎమ్మెల్యే సతీమణి బండ్ల జ్యోతితో కలిసి కేక్‌ కట్‌ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్‌, మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరి, పీఏసీసీఎస్‌ చైర్మన్‌ సుభాన్‌, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన మున్సిపల్‌ కమిషనర్‌

గద్వాల మున్సిపల్‌ కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్‌రెడ్డి గురువారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపల్‌ అధికారులు, చైర్మన్‌, కౌన్సిలర్ల సహకారంతో మున్సిపాలిటీని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. మున్సిపల్‌ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని కమిషనర్‌ ఎమ్మెల్యేకు చెప్పారు.  కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కేశవ్‌, నేతలు శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు.

ఎమ్మెల్యేకు నోట్‌ పుస్తకాలు 

అందజేసిన జములమ్మ ఆలయ చైర్మన్‌

జములమ్మ ఆలయ నూతన చైర్మన్‌గా ఎన్నికైన సతీశ్‌కుమార్‌ గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాలకమండలి సభ్యులతో ఎమ్మెల్యేను కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్‌ ఎమ్మెల్యేకు నోట్‌ పుస్తకాలు అందజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పాలకమండలి సభ్యులు జానకీరాములు, విజయ్‌కుమార్‌, రాము, శంకర్‌ ఉన్నారు.


VIDEOS

logo