ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Jan 27, 2021 , 00:26:36

రెండు బైక్‌ల ఢీ

రెండు బైక్‌ల ఢీ

  • ఒకరి మృతి

మల్దకల్‌,జనవరి 26 : రెండు బైక్‌లు ఢీకొని వ్యక్తి మృతిచెందిన ఘటన మల్దకల్‌ శివారులో మంగళవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం కర్ణాటకలోని జిలంగేరితండాకు చెందిన రాజునాయక్‌ (50) కూలీ పనులు చేసుకోవడానికి  బైక్‌పై మండలంలోని పాల్వాయి కు వెళ్తున్నాడు. ఈ క్రమంలో అయిజ నుంచి గద్వాలకు వెళ్తున్న మరో బైక్‌ మల్దకల్‌ శివారు రాగానే ఢీకొట్టింది. దీంతో రాజునాయక్‌ కిందపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఢీకొట్టిన అతను సంఘటనా స్థలాన్ని నుంచి పరారయ్యాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాజునాయక్‌కు భార్య లక్ష్మి,  ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

VIDEOS

logo