సోమవారం 08 మార్చి 2021
Gadwal - Jan 27, 2021 , 00:16:25

వాడవాడలా జెండా పండుగ

వాడవాడలా జెండా పండుగ

గద్వాల, జనవరి 26 :  గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాలో వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.  ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు, వివిధ పార్టీల కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో జాతీయ జెండాను అధికారులు, నాయకులు ఆవిష్కరించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి జెండా పండగను ఘనంగా నిర్వహించుకున్నారు.  జిల్లా కేంద్రంలోని పరేడ్‌ గౌండ్‌ల్రో కలెక్టర్‌ శృతిఓఝా, జెడ్పీకార్యాలయంలో జెడ్పీచైర్‌పర్సన్‌ సరిత,  కలెక్టరేట్‌ ఎదుట అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, డాక్టర్‌ అబ్రహం సమాచార కార్యాలయంలో డీపీఆర్‌వో చెన్నమ్మ, ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో రాములు,  జిల్లా వ్యవసాయ కార్యాలయంలో డీఏవో గోవింద్‌నాయక్‌ జెండాను ఆవిష్కరించారు. జిల్లా వైద్యా ఆరోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌వో చందూనాయక్‌,  డీఈవో కార్యాలయంలో ఇన్‌చార్జి డీఈవో సుశీందర్‌రావు, ఆర్టీసీలో డీఎం రామ్మోహన్‌, ఇంటర్‌ విద్యాశాఖ నోడల్‌ అధికారి హృదయరాజు కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఎగురవేశారు. గట్టు మండలం తుమ్మల చెరువు గ్రామానికి చెందిన సర్పంచ్‌ అనిత ఉత్తమ సర్పంచ్‌గా ఎన్నిక కాగా ఆమెను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితోపాటు ఆయన సతీమణి జ్యోతి క్యాంపు కార్యాలయం వద్ద పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అధికారులు బహుమతులను ప్రదానం చేశారు. ఆయా కార్యక్రమాల్లో  జిల్లా అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 


VIDEOS

logo