ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Jan 25, 2021 , 00:31:37

పేదలకు వరం సీఎం సహాయనిధి

పేదలకు వరం సీఎం సహాయనిధి

  • ఎమ్మెల్యే అబ్రహం

ఉండవెల్లి, జనవరి 24: సీఎం సహాయనిధి  పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలంలోని అలంపూర్‌ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్రహం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆదివారం పంపిణీ చేశారు. అలంపూర్‌ నియోజకవర్గంలోని 21మందికి రూ. 8లక్షల 18వేల విలువైన చెక్కులను పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే వివరించారు. కార్యక్రమంలో వడ్డేపల్లి మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌ కరుణశ్రీ, జెడ్పీటీసీ రాజు, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


VIDEOS

logo