పేదలకు అండగా సీఎం కేసీఆర్

- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
గద్వాల/గట్టు, జనవరి 23: ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పించి ముఖ్యమంత్రి కేసీఆర్ అగ్రవర్ణ పేదలకు అండగా నిలిచారని, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య సామాజిక వర్గాలకు చెందిన నాయకులు అన్నారు. సీఎం కేసీఆర్ అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం పై ఆయా సామాజిక వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా అగ్రవర్ణ పేదల నాయకులు మాట్లాడుతూ రా్రష్ట్రంలో అగ్రకులంలో జన్మించిన చాలామంది పేదరికంలో మగ్గుతున్నారన్నారు. పదిశాతం రిజర్వేషన్ కల్పించడం వల్ల విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అందుతాయని దీంతో చాలామంది వెనుక బడిన వారికి ప్రభుత్వం చేయూత నిచ్చినట్లు అయిందన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అగ్రవర్ణ పేదల్లో ఆత్మైస్థెర్యాన్ని నింపిందని, తామంతా సీఎంకు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, జెడ్పీ కోఆప్షన్ మెంబర్ ఇమామ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు సురేశ్శెట్టి, రామయ్య, ప్రాణేశ్, సాయిశ్యాంరెడ్డి, రవిరెడ్డి, రామకృష్ణశెట్టి తదితరులు పాల్గొన్నారు.
గట్టులో
అగ్రవర్ణాలకు చెందిన పేదలకు 10శాతం రిజర్వేషన్ల్లు కల్పిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. గట్టు మండల కేంద్రంలో రైతు సలహా మండలి జిల్లా కన్వీనర్ రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణలు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం గొప్ప విషయమన్నారు. దీంతో అగ్రవర్ణాల పేదలు, మధ్యతరగతి వారికి కూడా చదువులు, ఉద్యోగాల్లో అవకాశం లభించనుందని ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శ్రీనివాస్శెట్టి, సంగం చంద్రశేఖర్, టీఆర్ఎస్ నా యకులు బూదెప్ప, హనుమంతురెడ్డి, గోవిందు, బజారి, జి.క్రిష్ణ, వెంకటేశ్, శివ, గుణారిస్వామి పాల్గొన్నారు.