మంగళవారం 02 మార్చి 2021
Gadwal - Jan 23, 2021 , 00:16:24

యువత స్వయం ఉపాధితో ముందుకుసాగాలి

యువత స్వయం ఉపాధితో ముందుకుసాగాలి

అలంపూర్‌ , జనవరి 22 : యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపాధి మార్గాలతో ముందుకు సాగాలని నాబార్డు జిల్లా అభివృద్ధి అధికారి అమితాబ్‌ భార్గవన్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య భవనంలో ఏపీఎం పారిజాత ఆధ్యక్షతన నిర్వహించిన  మొబైల్‌ శిక్షణ తరగతుల ప్రారంభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారులు మాట్లాడుతూ 45రోజులపాటు మొబైల్‌ రిపేర్‌లో మెళకువలు నేర్చుకున్న వారికి దుకాణం నిర్వహణకు రుణాలు అందిస్తామన్నారు. అనంతరం డీఆర్డీవో ఉమాదేవి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏపీడీ సరోజ  , ఎంపీడీవో సుగుణకుమార్‌, డీఆర్డీ డీపీఎం రామ్మూర్తి, మిరాకిల్‌ సీఈవో మహ్మద్‌ జావేద్‌, బ్యాంకుల మేనేజర్లు సోమేశ్వర్‌రెడ్డి, సుధాకర్‌, నవీద్‌, సీసీ సునంద, విజయలక్ష్మి, ఆంజనేయులు పాల్గొన్నారు.


VIDEOS

తాజావార్తలు


logo