సోమవారం 08 మార్చి 2021
Gadwal - Jan 23, 2021 , 00:16:00

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట

  • ఎమ్మెల్యేలు వీఎం అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
  • ఉత్తనూర్‌  పీహెచ్‌సీ ప్రారంభం

అయిజ, జనవరి 22 : దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నదని అలంపూర్‌, గద్వాల ఎమ్మెల్యేలు అబ్రహం, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని ఉత్తనూర్‌ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని  అదనపు కలెక్టర్‌ శ్రీహర్షతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ మారుమూల గ్రామమైన ఉత్తనూర్‌లో మాజీ ఎంపీపీ తిరుమల్‌రెడ్డి అత్యాధునిక సౌకర్యాలతో సబ్‌ సెంటర్‌ను పున రుద్ధరించడం గర్వకారణమన్నారు. ప్రభుత్వ దవాఖానలలో అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆరోగ్యశ్రీతోపాటు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ద్వారా ఎంతో మంది రోగులకు భరోసా లభిస్తుందన్నారు. ప్రభుత్వ దవాఖానలలో కాన్పులు జరిగితే కేసీఆర్‌ కిట్‌తోపాటు ఆడపిల్లలకు రూ.13వేలు, మగపిల్లలకు రూ.12వే లు అందజేస్తున్నట్లు తెలిపారు. సబ్‌ సెంటర్‌లో కల్పించిన సౌకర్యాలపై పీహెచ్‌సీ డాక్టర్‌ రామలింగారెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు వేదికను పరిశీలించి, పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఎమ్మెల్యే అబ్రహం ఆవిష్కరించారు. కార్యక్రమం లో ఎస్పీ రంజన్‌ రతన్‌కుమార్‌,  డీఎస్పీ యాదగిరి, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ మాల నర్సింహులు, జెడ్పీటీసీ పుష్పమ్మ, ఎంపీపీ విజయ్‌, మాజీ ఎంపీపీ సుందర్‌రాజు, సింగిల్‌ విండో మాజీ అధ్యక్షుడు రాముడు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, డాక్టర్లు పాల్గొన్నారు. 

మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేద్దాం

వడ్డేపల్లి , జనవరి 22 : మున్సిపాలిటీ అభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేయాలని ఎమ్మెల్యే అబ్రహం పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ కార్యాలయంలో శుక్రవారం చైర్‌పర్సన్‌ కరుణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా డ్రైనేజీ కోసం రూ. కోటీ 50 లక్షలు , సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.12లక్షలు, పార్కు ఏర్పాటు కోసం రూ.10 లక్షలు, మున్సిపాలిటీ అభివృద్ధికోసం రూ.20లక్షలు ఖర్చు చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో వైస్‌ చైర్‌పర్సన్‌ సుజాత, కమిషనర్‌ వరుణ్‌, కౌన్సిలర్లు మాణిక్యం రవి, లలిత, ధనలక్ష్మి, దేవమ్మ,  సుజాత కోఆప్షన్‌ సభ్యుడు మైనొద్దీన్‌, రుక్సాన, దేవేంద్ర, రామకృష్ణారెడ్డి, ఏఈ శాంతారాం, మున్సిపాలిటీ సిబ్బంది పాల్గొన్నారు.


VIDEOS

logo