గురువారం 25 ఫిబ్రవరి 2021
Gadwal - Jan 23, 2021 , 00:17:13

ఆలయాల అభివృద్ధికి రూ.36.73 కోట్లు

ఆలయాల అభివృద్ధికి రూ.36.73 కోట్లు

  • అలంపూర్‌లోని జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలకు నిధులు
  • 30వ తేదీలోగా టెండర్లు
  • విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే అబ్రహం

ఉండవల్లి, జనవరి 22: జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.36.73కోట్లు మంజూరు చేసిందని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. అలంపూర్‌ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కృష్ణానది పుష్కరాలకు వచ్చి ఆలయాల అభివృద్ధికి ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేసినట్లు వివరించారు. వాటిలో పార్కింగ్‌, లైటింగ్‌, సీసీ కెమెరాల ఏర్పాటు, తాగునీటి వసతి, వరద నీటి కా ల్వలు, టాయిలెట్ల నిర్మాణాలకు రూ.6.47 కోట్లు, భక్తుల సౌకర్యాల సముదాయం, మల్టీమీడియా ప్రదర్శన, ల్యాండ్‌ స్కైపింగ్‌కు రూ. 11.93కోట్లు, బస్‌షెల్టర్‌, ఫుడ్‌కోర్టుకు రూ. 13.18కోట్లు, తుంగభద్ర ఘాట్‌ బోటింగ్‌ సౌకర్యానికి రూ.3కోట్లు, అప్రోచ్‌ లెవల్‌ సౌకర్యం డెకరేషన్‌ బోర్డులకు రూ.కోటి 32లక్షలు ఖర్చు చేయనున్నారన్నారు. 30వ తేదీలోగా టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు.

మంత్రి కేటీఆర్‌కు అన్ని అర్హతలున్నాయి

రాష్ట్రంలో రెండో సీఎంగా పాలన కొనసాగించేందుకు మంత్రి కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. ప్రతిపక్షాలు కేటీఆర్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు. సీఎం అభ్యర్థిగా నిర్ణయించేది టీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారమని అన్నారు. సీఎం కేసీఆర్‌ యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారన్నారు. కేటీఆర్‌పై అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ రవిప్రకాశ్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలయ కమిటీ మాజీ చైర్మన్‌ జల్లాపురం వెంకటేశ్వర్లు, నాయకుడు నతానీయోలు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo