ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Jan 23, 2021 , 00:17:11

రూ. 4లక్షల విలువైన మద్యం పట్టివేత

రూ. 4లక్షల విలువైన మద్యం పట్టివేత

ఉండవెల్లి, జనవరి 22 : అక్రమంగా త రలిస్తున్న రూ.4లక్షల విలువైన మద్యం ప ట్టుబడిన సంఘటన పంచలింగాల చెక్‌పో స్టు వద్ద చోటుచేసుకున్నది. కర్నూలు జిల్లా ఎక్సైజ్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య కథనం మేరకు.. శుక్రవారం తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని పంచలింగాల చెక్‌పో స్ట్‌ వద్ద ఎక్సైజ్‌ అధికారులు వాహనాల తని ఖీ నిర్వహించారు. కర్నూలు పట్టణం గీతానగర్‌కు చెందిన ముద్దుకృష్ణమనాయుడు కారులో తెలంగాణ నుంచి 1,323 మద్యం బాటిళ్లను తరలిస్తున్నట్లు తనిఖీల్లో గుర్తించారు. బాటిళ్ల విలువ రూ.4 లక్షలు ఉందని, కారుతోపాటు బాటిళ్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్‌ సీఐ తెలిపారు. తనిఖీల్లో ఎస్సై జిలాన్‌ భాష, సిబ్బంది షరీఫ్‌, సుబ్బారెడ్డి, రమణబాబు, సుధాకర్‌, స్వామి తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo