శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Gadwal - Jan 22, 2021 , 01:08:00

వైద్య, రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు

వైద్య, రక్తదాన శిబిరానికి  ఏర్పాట్లు

అయిజ, జనవరి 21 : ఈ నెల 31న ఉత్తనూర్‌లో నిర్వహించను న్న ఉచిత వైద్య, రక్తదాన శిబిరానికి ఏర్పాట్లు పక్కాగా చేపడుతున్నట్లు ఆర్డీవో రాములు తెలిపారు. గురువారం మండలంలోని ఉత్తనూర్‌ గ్రామంలోని ఎన్టీఆర్‌ మినీ స్టేడి యం, రైతు వేదిక భవనాలను మా జీ ఎంపీపీ తిరుమల్‌రెడ్డితో కలిసి ఆర్డీవో పరిశీలించారు. ఉచిత వైద్య శిబిరానికి జిల్లాలోని అన్ని మండలాల నుంచి వ్యాధిగ్రస్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో రోగులకు సరిపడే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆర్డీవో కోరారు. శిబిరానికి వచ్చే రోగులకు, సహాయకులకు భోజన సౌకర్యం కల్పిస్తున్నట్లు మాజీ ఎంపీపీ తిరుమల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నుంచి కరపత్రాల ద్వారా ప్రచారం ముమ్మరం చేస్తామని తిరుమల్‌రెడ్డి ఆర్డీవోకు వివరించారు.  కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుందర్‌రాజు, డాక్టర్‌ రవికుమార్‌, హెచ్‌ఎంలు తిమ్మారెడ్డి, సర్వేశ్వరాచారి, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశ్వర్‌రెడ్డి ఉన్నారు. 


VIDEOS

logo