శనివారం 06 మార్చి 2021
Gadwal - Jan 22, 2021 , 01:07:58

చివరి ఆయకట్టు వరకూ నీరందిస్తాం

చివరి ఆయకట్టు వరకూ నీరందిస్తాం

  • ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి

గద్వాల , జనవరి 21 : యాసంగిలో చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని, ఆ దిశ గా అధికారులు కృషి చేయాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సూచించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నీటి పారుదల, విద్యుత్‌, ఇతర శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యాసంగిలో పంటలకు నీటి విషయంలో ఇబ్బందులు కలుగకుండా నీటి పారుదల శాఖ అధికారులు చూడాలన్నారు. రైతు అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయ్‌కుమార్‌, విద్యుత్‌శాఖ అధికారి మోహన్‌, నీటి పారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. 

అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటు చేస్తాం

 గద్వాల మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లతోపాటు డ్రైనేజీలు ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గురువారం జిల్లాకేంద్రంలోని 23, 26వ వార్డులో రూ.20లక్షలతో ఏర్పాటు చేయనున్న సీసీ,డ్రైనేజీ పనులకు మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌తో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. గత ఎన్నికల సమయంలో తెలుగు పేట శివాలయం దగ్గర ఫంక్షన్‌ హాల్‌ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చానని దానికి ప్రస్తుతం భూమి పూజ చేశామని తెలిపారు. ఫంక్షన్‌ హాల్‌ను అన్ని సౌకర్యాలతో నిర్మిస్తామన్నారు. మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ సహకారంతో మున్సిపాలిటీలోని ప్రతి వార్డును అభివృద్ధి చేస్తామని తెలిపారు. అంతకుముందు ఎమ్మెల్యే శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు అనిత, లక్ష్మి, మురళి, నరహరిగౌడ్‌, నాగరాజు, మహేశ్‌, కృష్ణ, రిజ్వాన్‌, ఎంపీపీ విజయ్‌కుమార్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు యూసూఫ్‌, శ్రీనివాస్‌రెడ్డి, మొబిన్‌, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యేను కలిసిన జములమ్మ ఆలయ నూతన చైర్మన్‌

జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జములమ్మ దేవస్థానం నూతన చైర్మన్‌గా ఎన్నికైన సతీశ్‌కుమార్‌కు ఎమ్మెల్యే జీవో కాపీని అందజేశారు. ఈ సందర్భంగా నూతన చైర్మన్‌ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ త్వరలో జరగబోయే జములమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో పీఏసీసీఎస్‌ చైర్మన్‌ సుభాన్‌ డైరెక్టర్‌ రాము నాయకులు యూసుఫ్‌, శ్రీనివాస్‌రెడ్డి, రాము పాల్గొన్నారు.


VIDEOS

logo