సోమవారం 01 మార్చి 2021
Gadwal - Jan 22, 2021 , 02:10:20

వేరుశనగ ధర ఆల్‌టైమ్‌ రికార్డు

వేరుశనగ ధర ఆల్‌టైమ్‌ రికార్డు

  • క్వింటాకు రూ.8,001

నడిగడ్డ, జనవరి 21 : చరిత్రలో ఇప్పటి వరకు వేరుశనగకు ఇంత ధర పలకలేదు. మొన్న క్వింటా ధర రూ.7,712 పలకగా నిన్న రూ.9,986.. నే డు రూ.8,001 పలికింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం చెల్లెపాడు రైతు అంబయ్య తన పంటను గద్వాల మార్కెట్‌కు తీసుకురాగా గురువారం ట్రేడర్స్‌ క్వింటా ధర రూ.8,001 నిర్ణయించారు. ఇప్పటి వరకు అత్యధిక ధర పొందడంతో అంబయ్యను గద్వాల మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వరమ్మ శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మార్కెటింగ్‌ అధికారిణి పుష్ప మ్మ, మాజీ వైస్‌ చైర్మన్‌ నజీర్‌, తిమ్మన్న ఉన్నారు.  

VIDEOS

logo