సోమవారం 01 మార్చి 2021
Gadwal - Jan 19, 2021 , 02:19:43

ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల

ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శిని కలిసిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల

గద్వాల, జనవరి 18: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి రజత్‌కుమార్‌ని కలిసి పీజేపీ,నెట్టెంపాడ్‌ తదితర ప్రాంతాల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీజేపీ, నెట్టెంపాడ్‌ ప్రాజెక్టు పరిధిలో ముంపు గ్రామాలైన ఆలూరు, ర్యాలంపాడ్‌, చిన్నోనిపల్లి గ్రామాల్లో మిగిలిపోయిన పనులు చేపట్టాలని కోరినట్లు తెలిపారు. అలాగే ల్యాండ్‌ అక్విజేషన్‌కు సంబంధించి నిధులు వెంటనే విడుదల చేసి ఆర్‌ఆర్‌ సెంటర్లలో సౌకర్యాలు కల్పించాలని రజత్‌కుమార్‌ను కోరినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

VIDEOS

logo