మంగళవారం 02 మార్చి 2021
Gadwal - Jan 17, 2021 , 01:24:51

బాధితులతో మర్యాదగా వ్యవహరించాలి

బాధితులతో మర్యాదగా వ్యవహరించాలి

  • ఎస్పీ రంజన్త్రన్‌ కుమార్‌ 

గద్వాల న్యూటౌన్‌, జనవరి 16: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులు, ఫిర్యాదుదారులతో మర్యాదగా వ్యవహరించాలని ఎస్పీ రంజన్త్రన్‌కుమార్‌ అదేశించారు. శనివారం జిల్లా ప్రధాన పోలీస్‌ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెలలో నమోదైన కేసులు వివరాలు ఆయా పోలీస్‌సేషన్ల అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డయల్‌ 100 కాల్స్‌పై త్వరగా స్పందించడంతోపాటు మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఎఫ్‌ఎస్‌ఎల్‌, సీడీఆర్‌, సీడీఎఫ్‌ వంటి కేసులను పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకొని సులభంగా నేరాలను ఛేదించాలని చెప్పారు. ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లఘించిన వాహనదారులకు ఈ చలాన్‌ ద్వారా జరిమానా విధించాలన్నారు.  ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను చైతన్యం చేసి కళాజాత  బృందం ద్వారా వాటి ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. సమావేశంలో ఏఎస్పీ కృష్ణ, సీఐలు హన్మంతు, వెంకట్రామయ్య, ఎస్బీ ఇన్‌స్పెక్టర్‌ రాజేందర్‌, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ చంద్రశేఖర్‌, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.  

VIDEOS

logo