శనివారం 06 మార్చి 2021
Gadwal - Jan 17, 2021 , 01:24:55

కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

 కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ధరూరు/మల్దకల్‌, జనవరి 16: మండల కేంద్రంలోని పీహెచ్‌సీలో కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని జెడ్పీటీసీ పద్మావెంకటేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. డాక్టర్‌ స్రవంతి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమెతోపాటు అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొని ప్రారంభించారు. అనంతరం వ్యాక్సిన్‌ తీసుకున్న వారిని పరిశీలించారు.  కార్యక్రమంలో తాసిల్దార్‌ సుందర్‌రాజ్‌, ఆర్‌ఐ,  లతీఫ్‌, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, వివిధ శాఖల అధికారులు, పోలీసులు ఉన్నారు.

మల్దకల్‌లో..

శనివారం మండల కేంద్రంలోని ఆరోగ్య కేంద్రంలో కొవిడ్‌ వాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టారు. ఆరోగ్య కేంద్రంలో 35 మంది వైద్యసిబ్బంది, 52 మందిఆశ వర్కర్లు, 102 మంది అంగన్‌వాడీ టీచర్లు వ్యాక్సిన్‌లు వేయించుకున్నారు. ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే అరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు. 

రేపటినుంచి వ్యాక్సిన్‌ పంపిణీ

మానవపాడు/గట్టు, జనవరి 16: మానవపాడు, గట్టు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో  ఈ నెల 18న ఉదయం 9 గంటల నుంచి కొవిడ్‌ నివారణ కోసం వ్యాక్సినేషన్‌ నిర్వహించనున్నట్లు  ఆయా మండలాల వైద్యాధికారులు డాక్టర్‌ దివ్య, రాజసింహ తెలిపారు. ముందుగా ఆరోగ్య సిబ్బందికి టీకా వేస్తామని, రెండో విడుతలో ఆన్‌లైన్‌లో రిజిష్టర్‌ చేసుకున్న ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్‌ వేస్తామన్నారు. మలి దశలో 50 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్‌ అందిస్తామని తెలిపారు. గట్టు మండలంలో 18, 19, 21వ తేదీల్లో  270 మందికి వ్యాక్సిన్‌లు ఇవ్వనున్నట్లు డాక్టర్‌ రాజసింహ తెలిపారు. ముందుగా పారా మెడికల్‌ సిబ్బంది, ఆశ కార్యకర్తలు, అంగన్‌వాడీ కార్యకర్తలకు టీకాలు వేస్తామని పేర్కొన్నారు. 

VIDEOS

logo