ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Gadwal - Jan 16, 2021 , 00:28:49

ప్రతి ఇల్లు ఓ పాఠశాల కావాలి

ప్రతి ఇల్లు ఓ పాఠశాల కావాలి

  • గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌   
  • ఘనంగా స్వేరోస్‌ సంబురాలు

అలంపూర్‌, జనవరి 15 : ప్రతి ఇల్లు ఓ పాఠశా ల కావాలని తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం రా త్రి అలంపూర్‌ మండల కేంద్రంలో స్వేరోస్‌ సంబురాల నిర్వహణ కమిటీ, సీనియర్‌ రీసోర్స్‌పర్సన్‌ స్వాములు, డాక్టర్‌ ప్రసన్న కుమార్‌ ఆధ్వర్యంలో స్వేరోస్‌ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భం గా ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ఈ అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గురుకులాలను కార్పొరేట్‌కు దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు తె లిపారు. 21వ శతాబ్దంలో గురుకులాల్లో కోడింగ్‌ భాష నేర్పుతున్నారన్నారు. గురుకులాల్లో చదివిన విద్యార్థులు అలంపూర్‌ టూ హార్వడ్డ్‌ యూనివర్శిటీ వరకు వెళ్లాలని ఆకాంక్షించారు. జోగుళాంబ గ ద్వాల జెడ్పీ చైర్‌పర్సన్‌ సరిత మాట్లాడుతూ జీవితంలో పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చన్నారు. ప్రభుత్వం బాలికల చదువులను ప్రోత్సహించడం తో బాల్య వివాహాలు తగ్గాయన్నారు. బీసీ గురుకులాల కార్యదర్శి మల్లయ్య భట్టు మాట్లాడు తూ 1972 లో గురుకులాలు ప్రారంభమయ్యాయని, గతం లో ఎన్నడూ సాధించలేని విధం గా నేడు గురుకుల విద్యార్థులు ఎ న్నో విజయాలు సాధిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే డాక్టర్‌ వీ.అబ్ర హం మాట్లాడుతూ విద్యతోనే వి కాసం సమకూరుతుందన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ప్రభుత్వం గురుకులాలను అభివృద్ధి చేసిందన్నారు. అంతకు ముం దు బీఆర్‌ అంబేద్కర్‌, జ్యోతిరావు ఫూలే, సావిత్రీబాయి ఫూలే తదితర మహానుభావుల చిత్రపటాల కు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అ నంతరం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన గురుకు ల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నా యి. వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతుల ప్రదానం, మెమోంటోలు అందజేశా రు. గురుకులాల్లో చదివి డాక్టరేట్‌ సీటు సాధించిన విద్యార్థులను ప్రముఖులు సన్మానించారు. కార్యక్రమంలో వికారాబాద్‌ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌, క ర్నూల్‌ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, తెలంగాణ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అ డిషనల్‌ సెక్రటరీ మామిడాల ప్రవీణ్‌కుమార్‌, స్వే రోస్‌ అనుబంధ సంఘాల నాయకులు ఉన్నారు.

VIDEOS

logo