మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయం

- ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, జనవరి 15: గద్వాల మున్సిపాలిటీ అభివృద్ధే తమ ధ్యేయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం 11వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా రూ.8లక్షల నిధులతో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనాన్ని ప్రారంభించారు. అదే వార్డులో రూ.10లక్షల నిధులతో డ్రైనేజీ,సీసీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టణంలో ఎక్కడ ఖాళీ స్థలాలు ఉంటాయో అక్కడ పార్కులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మున్సిపల్ మంత్రి కేటీఆర్ సహకారంతో మున్సిపాలిటీలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు చెన్నయ్య, కౌన్సిలర్లు వసిమాబేగం, మురళి, నాగిరెడ్డి, నరహరి శ్రీనివాసులు, శ్రీను, మహేశ్, కృష్ణ, లక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు సాయిశ్యాంరెడ్డి, ధర్మనాయుడు, వీరేశ్తోపాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
బాధితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం
బాధితులకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి అన్నా రు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్దకల్ మండలం నీలిపల్లి గ్రామానికి చెందిన నిరీక్షణమ్మకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.3లక్షల ఎల్వోసీని ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు అజయ్, శివారెడ్డి, పెద్దకృష్ణ, రాజన్న, తిరుపతన్న, సాయిశ్యాంరెడ్డి పాల్గొన్నారు. కాగా అదే గ్రామానికి చెందిన రైతు దుబ్బన్న అనారోగ్యంతో మృతి చెందగా ఆయన భార్య ఇందిరమ్మకు ప్రభుత్వం తరఫున వచ్చిన రైతు బీమా చెక్కు రూ.5లక్షలను ఎమ్మెల్యే అందజేశారు.
వాల్మీకి బోయ సేవా సంఘం,ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ
జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి వాల్మీకి బోయ సేవా సంఘం, ఉద్యోగుల సంఘం 2021 క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్రవినియోగదారుల ఫో రం చైర్మన్ గట్టుతిమ్మప్ప, జెడ్పీవైస్ చైర్మన్ సరోజమ్మ, కౌ న్సిలర్ మురళి, వాల్మీకి సంఘం నాయకులు రాములు, కోటేశ్, ఉద్యోగ సంఘం నాయకులు కృష్ణయ్య, రంగన్న తదితరులు పాల్గొన్నారు.
ఆరగిద్దలో రైతుసంబురాలు ప్రారంభం
గట్టు, జనవరి 15 : వ్యవసాయం దండుగ కాదు పండుగ అని టీఆర్ఎస్ ప్రభుత్వం నిరూపించిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. మండలంలోని ఆరగిద్దలో శివ వీరాంజనేయ స్వామి జాతర సందర్భంగా రైతు సంబురాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి టెండర్లను త్వరలో పిలువనున్నట్లు స్పష్టంచేశారు. కార్యక్రమంలో సర్పంచ్ యోగేశ్వరి, ఎంపీటీసీ లక్ష్మి, ఎంపీపీ విజయ్‌కుమార్, పీఏసీసీఎస్ చైర్మన్ క్యామ వెంకటేశ్, టీఆర్ఎస్ నాయకులు రామకృష్ణారెడ్డి, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- మిరియాలతో బరువు ఎలా తగ్గవచ్చంటే..?
- బెంగాల్ పోరు : తృణమూల్‌లో నటులు, సెలబ్రిటీల చేరిక!
- ఆకాశంలో తేలుతున్న ఓడ.. ఫొటో వైరల్
- ఏపీలో కొత్తగా 102 కరోనా కేసులు
- నవీన్, ప్రియదర్శిలను ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- దిగొస్తున్న బంగారం.. మున్ముందు కింది చూపులేనా?!
- మమతా దీదీ.. రాయల్ బెంగాల్ పులి: నెత్తికెత్తుకున్న శివసేన
- కనిపించినవాళ్లను కాల్చేస్తా.. టిక్‌టాక్‌లో సైనికుల బెదిరింపు
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా
- సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు