సంబురంగా భోగి

- భోగి మంటలు వేసి సంస్కృతి చాటిన తెలంగాణ జాగృతి
గద్వాల/ గట్టు /మల్దకల్/అయిజ /అయిజ రూరల్ /వడ్డేపల్లి /ఎర్రవల్లి చౌరస్తా, జనవరి 13 : జిల్లాలోని ఆయా మండలాల్లో భోగి వేడుకలను బుధవారం ప్రజలు సంబురంగా నిర్వహించారు. మహిళలు ఇండ్ల ఎదుట రంగురంగులతో ముగ్గులు వేసి వాటిపై గొబ్బెమ్మలు పెట్టి నూవ్వుల రొట్టెలతో పండుగను జరుపుకొన్నారు. జిల్లా కేంద్రంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు వెంగళరెడ్డి సహకారంతో తెలంగాణ యువజన విభాగం ఆధ్వర్యంలో బీరెళ్లి చౌరస్తా వద్ద భోగిమంటల వేశారు. అనంతరం పిల్లలు, పెద్దలు పతంగులను ఎగురవేసి పండుగను ఆనందంగా నిర్వహించుకున్నారు. కార్యక్రమంలో గీత, నాగలత, సాయిశ్యాం రెడ్డి, మహిళా కన్వీనర్లు శ్రీలతారెడ్డి, పవిత్ర జిల్లా అధికార ప్రతినిధి ప్రతాప్‌రెడ్డి, షకీల్, రాములు, వినోద్‌కుమార్, శంకర్,రంగస్వామి, విజయ్‌భాస్కర్, ఈశ్వర్, కిరణ్ ఆదిత్య, రిషిక పాల్గొన్నారు.
ఆసక్తిగా ముగ్గుల పోటీలు
గట్టు : సంక్రాంతి సందర్భంగా గ్రామ పంచాయతీ ఆవరణలో సర్పం చ్ ఉప్పరి ధనలక్ష్మి ఆధ్వర్యంలో ము గ్గుల పోటీలను బుధవారం నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ విజేతలుగా శ్యామల, నాగవేణి, సంయుక్త, నందిని నిలిచారు. వీరికి రూ.2016, రూ.1516, రూ.1016, రూ.516 నగదును సర్పంచ్ అందజేశారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈవో సత్యనారాయణ, వార్డుసభ్యుడు రమేశ్ పాల్గొన్నారు.
మన గ్రోమోర్ ఆధ్వర్యంలో ..
వడ్డేపల్లి, జనవరి 13 : మండలంలోని రామాపురం గ్రామంలో బుధవారం శాంతినగర్ మన గ్రోమోర్ సెంటర్ మేనేజర్ మల్లికార్జున ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ప్రథమ స్థానంలో పల్లవి, ద్వితీయ స్థానంలో సరిత, తృతీయ స్థానంలో రాధిక నిలువగా వారికి ప్రోత్సాహక బహుమ తులను మేనేజర్ అందజేశారు. కార్యక్రమం లో వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి, లక్ష్మీ కాంతరెడ్డి, షేక్షా, పావని, గుండ్ల లక్ష్మన్న , శేఖర్, నాగరాజు, పరశురాముడు తది తరులు పాల్గొన్నారు.
మార్లబీడులో ..
ధరూర్, జనవరి13: మార్లబీడు గ్రామంలో సంక్రాంతిని పురస్కరించుకుని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సుజాత, టీఆర్ఎస్ నాయకులు శ్రీరాములు గ్రామస్తులు పాల్గొన్నారు.
డైరీ ఆవిష్కరణ
గద్వాల అర్బన్, జనవరి 13 : సమస్యల పరిష్కారానికి పోరాటమే మార్గమని, హక్కులు సాధించుకోవడానికి అందరూ సమిష్టిగా సహకరించాలని జిల్లా ట్రెజరీ అధికారి మహ్మద్ హఫీజ్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కార్యాల యంలో 2021 డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో సభ్యులు నాగేందర్, సూర్యప్రకాశ్, కృష్ణయ్య, సోమశేఖర్, ప్రభాకర్ ఉన్నారు.
చట్టాలపై అవగాహన ఉండాలి
గద్వాల రూరల్,జనవరి13: చట్టాలపై ప్రతిఒక్కరికీ అవగాహన కలిగి ఉండాలని చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ జ్ఞానేంద్రచారి పేర్కొన్నారు. మండలంలోని అనంతపురం గ్రామంలో బుధవారం శిశు సంక్షేమ శాఖ చైల్డ్ లైన్ ఆధ్వర్యంలో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సురేశ్ గ్రామ ఆదర్శ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అధికారుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల చర్చలు
- బిగ్‌బాస్ ఫేం మెహబూబ్ 'ఎవరురా ఆ పిల్ల' వీడియో సాంగ్ కేక
- ఏపీలో కొత్తగా 111 మందికి కరోనా
- టాప్ 10 ఐటీ సేవల బ్రాండ్ ‘’ ఇన్ఫోసిస్
- రైతు సంఘాల్లో చీలిక.. వైదొలగిన రెండు సంఘాలు
- సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు
- 1000మంది గర్ల్ఫ్రండ్స్..1075 ఏళ్ల జైలు శిక్ష
- ఎస్ఐఎఫ్సీఏ కన్వీనర్‌గా పిట్టల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక
- 11 లక్షల పీఎం కిసాన్ నగదు బదిలీలు విఫలం
- చంద్రబాబు కోసమే ‘ఎస్ఈసీ’ పని చేస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి