శుక్రవారం 05 మార్చి 2021
Gadwal - Jan 14, 2021 , 00:35:00

కల్యాణం.. కమనీయం

కల్యాణం.. కమనీయం

గద్వాలటౌన్‌,జనవరి 13 : వేదపండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల గోవింద నామ స్మరణల మధ్య బుధవారం గోదారంగనాథస్వామి కల్యా ణం కమనీయంగా సాగింది. సంక్రాంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని బుర్దాపేటలోని రంగనాథస్వామి, సంతానవేణుగోపాల స్వామి  ఆలయాల్లో గోదాదేవి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు విశ్వక్షేణుని ఆరాధన కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం పుణ్యహవాచకం, కంకణధారణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ఆయా ఆలయాల ప్రాంగణాలలో ప్రత్యేక రథంపై స్వామి వారిని అమ్మవారిని ఊరేగించారు. కల్యాణం తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. 

అమ్మవారికి పుస్తెలతాడు వితరణ

కేటీదొడ్డి :  మండలంలోని పాగుంట లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం, మండలకేంద్రంలోని శివాలయాలకు అమావాస్యను పురస్కరించుకొని  బుధవారం భక్తులు పోటెత్తారు. పాగుంట లక్ష్మీదేవి అమ్మవారికి ఆత్మకూర్‌ పట్టణానికి చెందిన శివకుమార్‌,అరుణ దంపతులు రూ.3 లక్షల విలువ గల పుస్తెల తాడును వితరణ చేశారు. లక్ష్మీ వేంకటేశ్వర స్వాముల  కల్యాణంలో భాగంగా అమ్మవారికి మెడలో నూతనంగా చేయించిన పుస్తెలతాడును అర్చకులు వేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్దలు శేషిరెడ్డి, పద్మారెడ్డి, ఆంజనేయులు పాల్గొన్నారు.


VIDEOS

logo