శుక్రవారం 05 మార్చి 2021
Gadwal - Jan 14, 2021 , 00:34:36

జ్ఞాన సమాజ నిర్మాణం కోసమే స్వేరోస్‌

జ్ఞాన సమాజ   నిర్మాణం కోసమే స్వేరోస్‌

అలంపూర్‌, జనవరి 13 : నిరక్షరాస్యత, అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను పారద్రోలి జ్ఞాన సమాజ నిర్మాణం కోసమే నిరంతరం పని చేస్తున్నామని స్వేరోస్‌ రీసోర్స్‌ పర్సన్‌ సోలపోగుల స్వాములు, స్వేరోస్‌ నా యకుడు కేశవరావు అన్నారు. బుధవారం స్వేరోస్‌ సంబురాల్లో భాగంగా సుప్రీమ్‌ స్వేరోస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు అలంపూర్‌లో  విద్యార్థులకు పరుగు పందెం, వ్యాసరచన పోటీలు, చిత్ర లేఖనం, కవితలు, ముగ్గులు, హైజంప్‌, లాంగ్‌ జంప్‌ వంటి క్రీడలు నిర్వహించామన్నారు. విజేతలకు 14వ  తేదీన బహుమతి ప్రదానం ఉంటుందన్నారు. నెల రోజుల నుంచి ఉ మ్మడి తెలుగు రాష్ర్టాల్లో స్వేరోస్‌ సంబురాల  గురించి ప్రచారం చేసి ప్రముఖులను ఆహ్వానించామని  తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ, డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రసన్న కుమార్‌, ఆర్గనైజింగ్‌ చైర్మన్‌ కనకం బాబు, ఉపాధ్యాయులు వెంకటేశ్‌, రమే శ్‌, వెంకట్రామయ్యవెట్టి, ఈదన్న, రేపల్లె దేవదాసు, మహేశ్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo