సోమవారం 01 మార్చి 2021
Gadwal - Jan 10, 2021 , 01:00:32

మొసలి కలకలం

మొసలి కలకలం

మల్దకల్‌, జనవరి 9 : జోగుళాంబ గద్వాల జి ల్లా మల్దకల్‌ మండలం దాసరిపల్లి గ్రామస్తులు చె రువులో ఉన్న మొసలిని బంధించారు. గ్రామంలోని రాజాబావి చెరువులో నాలుగైదు రోజుల కిం దట కొందరు గ్రామస్తులకు మొసలి కనిపించింది. ఈ విషయాన్ని సర్పంచ్‌ భరత్‌రెడ్డికి తెలిపారు. అ ప్రమత్తమైన ఆయన గ్రామ చెరువులో మొసలి ఉందని, అక్కడికి ఎవరూ వెళ్లవద్దని చాటింపు వే యించాడు. శుక్రవారం రాత్రి దాసరిపల్లి-ఉల్లెపల్లి గ్రామాల మధ్య ఉన్న రోడ్డుపైకి మొసలి రాగా పొ లం వద్దకు వెళ్తున్న ఓ రైతు చూసి సర్పంచ్‌కు తెలిపాడు. వెంటనే గ్రామస్తులతో కలిసి అక్కడికి చేరుకొని మొసలిని వలలతో బంధించారు. అనంత రం అటవీ శాఖాధికారులకు అప్పగించగా వారు జూరాల ప్రాజెక్టులో వదిలారు. 

VIDEOS

తాజావార్తలు


logo